ప్రస్తుతం ఎక్కడ చూసినా మలయాళ సినిమాల హవానే నడుస్తోంది. ఆడు జీవితం, ముంజుమ్మల్ బాయ్స్, ఆవేశం, భ్రమయుగం, ప్రేమలు.. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వందలాది కోట్ల రూపాయలను వసూళ్లు చేశాయి. ఇక ఓటీటీలో అయితే మాలీవుడ్ సినిమాలకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటిది మలయాళంలో ఇప్పుడు మరో క్రేజీ వెబ్ సిరీస్ రానుంది. సాధారణంగా ఏదైనా సినిమాలో కానీ వెబ్ సిరీస్ లో కానీ ఇద్దరు లేదా ముగ్గురు స్టార్స్ నటిస్తారు. కానీ ఈ వెబ్ సిరీస్‌లో మాత్రం మలయాళ స్టార్స్ అందరూ నటించారు. మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, కమల్ హాసన్, బిజు మేనన్, పార్వతి తిరువత్తు, అపర్ణ బాలమురళి, అసిఫ్ అలీ, సిద్ధిఖీ.. ఇలా దాదాపు టాప్ సెలబ్రిటీలందరూ ఈ వెబ్ సిరీస్ లో భాగమయ్యారు. సుమారు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సిరీస్.. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మనోరథంగల్ పేరుతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 ఓటీటీలో ఆగస్టు 15 నుంచి ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నూ మనోరథంగల్ వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది.
.
మలయాళ ప్రముఖ ఎమ్‌టీ వాసుదేవర్ నాయర్ రాసిన స్టోరీతో మనోరథంగల్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. 9 భాగాల అంథాలజీని మొత్తం 8 మంది స్టార్ డైరెక్టర్స్ తెరకెక్కించారు. ప్రియదర్శన్, రంజిత్, సంతోష్ శివన్, శ్యామ్ ప్రసాద్, జయరాజ్, అశ్వతి, రతీశ్ అంబట్, మహేశ్ నారయణన్ వంటి ప్రముఖ దర్శకులు మనో రథంగల్ వెబ్ సిరీస్ లో భాగమయ్యారు. మొత్తం 9 భాగాలున్న ఈ అంథాలజీ వెబ్ సిరీస్ లో ఒక్కో భాగం నిడివి సుమారు 50 నిమిషాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఆగస్టు 15 నుంచి జీ5 ఓటీటీలో మనోరథంగల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్..
9 stories, 9 Superstars, 9 Legendary filmmakers bring you the biggest blockbuster in Indian cinema!
Here’s the trailer for #Manorathangal – a tribute to M. T. Vasudevan Nair. #ManorathangalOnZEE5 #WatchOnZEE5 #ZEE5Keralam pic.twitter.com/ooOkqivWdB
— ZEE5 Keralam (@zee5keralam) July 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.