
నందమూరి కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. తల్లీ కొడుకుల సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. కల్యాణ్ రామ్, విజయశాంతిల నటన బాగున్నా కథ, కథనాలు ఆడియెన్స్ ను నిరాశపర్చాయి. అయితే క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అందరినీ కదలించింది. అలాగే కల్యాణ్ రామ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగున్నాయని ప్రశంసలు వచ్చాయి. మొత్తానికి థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం (మే12) అర్ధరాత్రి నుంచే ఈ మూవీ ఓటీట స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ప్రస్తుతం తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ, యూకేలో ఉన్నవాళ్లు అది కూడా అద్దె విధానంలో మాత్రమే ఈ మూవీని చూడొచ్చు. అయితే ఈ గురువారం లేదా శుక్రవారం ఇండియాలో కూడా ఈ మూవీ అందుబాటులోకి రావొచ్చునని తెలుస్తోంది.
ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాను నిర్మించారు. అర్జున్ రాంపాల్, సోహైల్ ఖాన్, పృథ్వీ రాజ్, చరణ్ రాజ్, భరత్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.
#ArjunSonOfVyjayanthi Available as rent option outside India on #PrimeVideo pic.twitter.com/mzvtOb9DsV
— MOVIE MAGIC (@MovieMagic24) May 12, 2025
Feel the warmth of a mother’s heart with #MuchatagaBandhaale full video song from #ArjunSonOfVyjayanthi.
A @AJANEESHB musical.@NANDAMURIKALYAN @vijayashanthi_m @saieemmanjrekar @SohailKhan @Dirpradeepch @SunilBalusu1981 @muppaav @HaricharanMusic… pic.twitter.com/lnRWGdoBJh
— Aditya Music (@adityamusic) May 10, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.