నందమూరి హీరో కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం బింబిసార (Bimbisara). ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇందులో ఆయన నటనకు ప్రేక్షకులు, సినీ విమర్శకులు ఫిదా అయ్యారు. కళ్యాణ్ రామ్ సహజ నటనకు.. డైరెక్టర్ వశిష్ట స్క్రీన్ ప్లే ప్రశంసలు కురిపించారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది.. పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు కీరవాణి, చిరంతన్ సంగీతం అందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది.
లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5 సొంతం చేసుకుందట. అంతేకాకుండా ఈ మూవీ విడుదలైన 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒప్పందం కుదుర్చుకున్నారట. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ సినిమాలో భీమ్లానాయక్ బ్యూటీ సంయుక్త మీనన్, కేథరిన్ కథానాయికలుగా కనిపించగా.. చోటా కె నాయుడు చాయాగ్రహణం అందించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.