Kajal: పుస్తకంలోని పాత్రలు దెయ్యాలైతే.. ఓటీటీలోకి వచ్చేసిన కాజల్‌, రెజీనాల హారర్‌ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

|

Jul 11, 2023 | 9:10 AM

కాజల్‌ అగర్వాల్‌, రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'కరుంగాపియం'. కార్తికేయన్‌ (డీకే) తెరకెక్కించిన ఈ మూవీలో రైజా విల్సన్‌, యోగిబాబు, జనని తదితరులు కీలక పాత్రలు పోషించారు. మొత్తం ఐదు క‌థ‌ల‌తో ఆంథాల‌జీగా తెరకెక్కిన కరుంగాపియం మే 19న థియేటర్లలో విడుదలైంది.

Kajal: పుస్తకంలోని పాత్రలు దెయ్యాలైతే.. ఓటీటీలోకి వచ్చేసిన కాజల్‌, రెజీనాల హారర్‌ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?
Karungaapiyam Movie
Follow us on

కాజల్‌ అగర్వాల్‌, రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘కరుంగాపియం’. కార్తికేయన్‌ (డీకే) తెరకెక్కించిన ఈ మూవీలో రైజా విల్సన్‌, యోగిబాబు, జనని తదితరులు కీలక పాత్రలు పోషించారు. మొత్తం ఐదు క‌థ‌ల‌తో ఆంథాల‌జీగా తెరకెక్కిన కరుంగాపియం మే 19న థియేటర్లలో విడుదలైంది. తెలుగులో కార్తీకగా విడుదలైంది. అయితే ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడిదే సినిమా డిజిటల్‌ ప్రీమియర్‌గా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో నిన్న (జులై 10) కరుంగాపియం స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ రెంటల్‌ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. కరుంగాపియం చూడాలంటే రూ.99 చెల్లించాల్సిందే. మరికొన్ని రోజుల తర్వాత అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్లందరూ ఉచితంగా చూడవచ్చు. అయితే తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి రాలేదు. త్వరలోనే ఇది కూడా రావొచ్చని సమాచారం.

ఇక కథ విషయానికొస్తే.. కార్తిక (రెజినా) సరదాగా ఓ ఓల్డ్‌ లైబ్రరీకి వెళుతుంది .అక్కడ వందేళ్ల క్రితం నాటి ‘కాటుక బొట్టు’ అనే పుస్తకం కనిపిస్తుంది. అయితే ఆమె పుస్తకంలో చదివే పాత్రలన్నీ దెయ్యాలుగా మారి తన ముందుకు వస్తుంటాయి. అందులో కాజల్‌ (కార్తిక) కూడా ఉంటుంది. పగ తీర్చుకోవాలని దెయ్యంగా మారుతుంది. మరి కాజల్‌ ఎలా చనిపోయింది. తన పగను ఎలా తీర్చుకుంది? ఇందులో రెజీనా పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే కరుంగాపియం మూవీని చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..