OTT: 25 కోట్లతో తీస్తే 140 కోట్లు.. తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన పిల్ల దెయ్యం సినిమా.. ఒంటరిగా మాత్రం చూడద్దు

|

Sep 22, 2024 | 4:29 PM

ఓటీటీలో సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. మరీ ముఖ్యంగా దెయ్యం సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ అవుతుంటాయి. అలా ఇటీవల థియేటర్లలో ఆడియెన్స్ ను ఓ రేంజ్ లో భయపెట్టిన దెయ్యం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. అదే ముంజ్య.

OTT: 25 కోట్లతో తీస్తే 140 కోట్లు.. తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన పిల్ల దెయ్యం సినిమా.. ఒంటరిగా మాత్రం చూడద్దు
Munjya Movie
Follow us on

ఓటీటీలో సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. మరీ ముఖ్యంగా దెయ్యం సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ అవుతుంటాయి. అలా ఇటీవల థియేటర్లలో ఆడియెన్స్ ను ఓ రేంజ్ లో భయపెట్టిన దెయ్యం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. అదే ముంజ్య. ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 7న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్ తో మూవీ తీస్తే ఏకంగా రూ. 140 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. అలాగనీ ఈ సినిమాలో పెద్దగా పేరున్న నటులెవరూ లేరు. కథనే ఈ సినిమాకు మెయిన్ హీరో. ఆదిత్య సర్పోదర్ తెరకెక్కించి ఈ సూపర్ హారర్ మూవీలో శార్వరీ వాఘ్, అజయ్ వర్మ ప్రధాన పాత్రలలో నటించారు. థియేటర్లలో ప్రేక్షకులను భయ పెడుతూనే కడుపుబ్బా నవ్వించిన ముంజ్య సినిమా కొన్ని రోజుల క్రితమే ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఆగస్టు 25నే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే అప్పుడు కేవలం హిందీ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు. ఇప్పుడు ముంజ్య తెలుగు, తమిళ వెర్షన్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

1952, 2023 రెండు బ్యాక్‌డ్రాప్‌ల‌లో ద‌ర్శ‌కుడు ముంజ్య సినిమాను తెర‌కెక్కించాడు. ఈ చిత్రంలో శార్వరి, అభయ్ వర్మతోపాటు సత్యరాజ్, మోనా సింగ్, సుహాస్ జోషి, తరణ్ జ్యోతి సింగ్, అజయ్ పుర్కర్, ఆయుష్ కీలకపాత్రలు పోషించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. 1952లో గోట్యా పిల్లాడు అనుకోకుండా చనిపోతాడు. ముంజ్య అనే పిల్ల దెయ్యంగా మారిపోతాడు. ఆ తర్వాత కథ నేరుగా 2023లోకి అడుగు పెడుతుంది. పుణెలో బిట్టు అనే కుర్రాడు తల్లి, నానమ్మతో కలిసి జీవిస్తుంటాడు. కుక్కకి కూడా భయపడే ఇతడు.. అనుకోకుండా ముంజ్య ఉండే చోటుకు వెళ్తాడు. దీంతో ముంజ్య బయటకు వస్తాడు. అప్పటినుంచి బిట్టు జీవితంలో పిల్ల దెయ్యం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. మరి ఆ దెయ్యం బిట్టు వెనక పడటానికి కారణమేంటి? చివరకు ముంజ్యను ఎలా వదిలించుకున్నాడన్నదే సినిమా.

ఇవి కూడా చదవండి

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

ముంజ్య ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.