Thug Life: ఓటీటీ రైట్స్‌లో కమల్ సరికొత్త రికార్డు.. ‘థగ్ లైఫ్’ ఎన్ని కోట్లకు అమ్ముడైందో తెలుసా?

లోక నాయకుడు కమల్‌హాసన్‌కి ఉన్నక్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ‘విక్రమ్’ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగా పాపులారిటీ పెరిగంది. దీనికి తోడు కమల్ ఇప్పుడు రాజకీయాలను పక్కనబెట్టి సినిమాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో 'థగ్ లైఫ్' అనే సినిమాలో నటిస్తున్నాడీ సీనియర్ హీరో.

Thug Life: ఓటీటీ రైట్స్‌లో కమల్ సరికొత్త రికార్డు.. 'థగ్ లైఫ్' ఎన్ని కోట్లకు అమ్ముడైందో తెలుసా?
Thug Life Movie
Follow us

|

Updated on: Sep 22, 2024 | 6:36 PM

లోక నాయకుడు కమల్‌హాసన్‌కి ఉన్నక్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ‘విక్రమ్’ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగా పాపులారిటీ పెరిగంది. దీనికి తోడు కమల్ ఇప్పుడు రాజకీయాలను పక్కనబెట్టి సినిమాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ అనే సినిమాలో నటిస్తున్నాడీ సీనియర్ హీరో. ఈ మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమ్మకానికి సంబంధించి ఓ ఆశ్చర్యకరమైన వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఏకంగా 150 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. కమల్ హాసన్ సినిమాలను అన్ని రకాల ఆడియెన్స్ చూస్తారు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఈ నటుడి సినిమాలను ఇష్టపడతారు. ఈ కారణంగానే ఆయన సినిమాకు ఓటీటీలో కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది. ఇక మణిరత్నం సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇష్టపడతారు. అందుకే ‘థగ్ లైఫ్’ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.

సాధారణంగ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి టీజర్, సాంగ్ లేదా ట్రైలర్ చూసిన తర్వాత సాధారణంగా OTT కంపెనీలతో డీల్ మొదలవుతుంది. అయితే కొన్ని సినిమాలకు షూటింగ్ పూర్తి కాకముందే భారీ డిమాండ్ ఏర్పడుతుంది. ఆ బాటలోనే ‘థగ్ లైఫ్’ సినిమా కూడా నడుస్తోంది. షూటింగ్ ఇంకా కొనసాగుతుండగానే ఓటీటీ ప్రసార హక్కులు అమ్ముడుపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ‘థగ్ లైఫ్’ సినిమా ప్రసార హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ రూ.150 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘థగ్ లైఫ్’ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శింబు, త్రిష కృష్ణన్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా 2025లో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

థగ్ లైఫ్ సెట్ లో కమల్ హాసన్, మణిరత్నం తదితరులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.