కొత్త కంటెంట్ ఎంకరేజ్ చేసేందుకు అడియన్స్ ఎప్పుడూ ముందుంటారు. భారీ బడ్జెట్ కాకుండా… ఎలాంటి హడావిడి లేకుండా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. అలాగే లవ్, కామెడీ, క్రైమ్, హరర్ అంశాలతో రూపొందుతున్న వెబ్ సిరీస్లకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇటీవల మలయాళంలో తెరకెక్కిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే తమిళంలో వచ్చే వెబ్ సిరీస్ కూడా హిట్ అవుతున్నాయి. నాణ్యమైన కంటెంట్ తో వచ్చిన మాథగం, లేబుల్ వంటి సిరీస్ లు ప్రేక్షకులను అలరించాయి. ఇక ఇప్పుడు ఓటీటీలోకి మరో కామెడీ రొమాంటిక్ వెబ్ సిరీస్ వచ్చేసింది. అదే హార్ట్ బీట్.. ది రిథమ్ ఆఫ్ లైన్ పేరుతో వచ్చిన తమిళ్ వెబ్ సిరీస్. దీపక్ సుందర్ రాజన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మెడికల్ కామెడీ డ్రామాగా తెరకెక్కించారు. ఇందులో మలయాళి నటి అనుమోల్, దీపా బాలు, చారుకేష్, ఆర్జీ రామ్, సర్వా, పదిన కుమారు, గురు లక్ష్మణ్, జయరావు సీహెచ్ కీలకపాత్రలు పోషించారు.
కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ట్రైనీ డాక్టర్స్ రియల్ లైఫ్ ఎలా ఉంటుంది ?.. అనే అంశం ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. కామెడీ రొమాంటిక్ ఎంర్టైనర్ గా వచ్చిన ఈ సిరీస్ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. అందులో కొందరు ట్రైనీ డాక్టర్స్ మొదటిరోజే వృత్తిలో జాయిన్ అవుతారు. ఆరోజంతా ఎంతో కన్ఫ్యూజన్ తో ఆసుపత్రిలో విభిన్న పరిస్థితులు ఎదుర్కొంటారు.
ఆసుపత్రిలో తెర వెనుక ఏం జరుగుతుంది ?.. సిబ్బంది తమ వృత్తిని ఎలా అన్వేషిస్తారు అనే అంశాలను వినోదాత్మకంగా ఇందులో చూపించారు. ఈ సిరీస్ ను అమెరికన్ షో గ్రేస్ అనాటమీ ఆధారంగా తెరకెక్కించారు. ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8 నుంచి ఈ సిరీస్ ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.