Unstoppable With NBK2: బాలయ్య షోకు నెక్స్ట్ గెస్ట్ ఎవరో గెస్ చేయండి.. ఆహా ఇచ్చిన పజిల్ అంత ఈజీ కాదు గురూ..

|

Oct 15, 2022 | 6:04 PM

మొదటి ఎపిసోడ్‌ సూపర్‌ హిట్‌ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి రెండో ఎపిసోడ్‌పై పడింది. ఈసారి బాలయ్య షోకు ఎవరు వస్తారోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈనేపథ్యంలో ఆహా యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ షేర్‌ చేసింది.

Unstoppable With NBK2: బాలయ్య షోకు నెక్స్ట్ గెస్ట్ ఎవరో గెస్ చేయండి.. ఆహా ఇచ్చిన పజిల్ అంత ఈజీ కాదు గురూ..
Balakrishna
Follow us on

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్‌ రెండో సీజన్‌ గ్రాండ్‌గా ప్రారంభమైంది. తన వియ్యంకుడు, టీడపీ అధినేత చంద్రబాబు నాయుడు, అతని కుమారుడు నారా లోకేశ్‌లతో జరిగిన మొదటి ఎపిసోడ్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. అన్‌స్టాపబుల్‌ షోలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, బాలయ్య రెస్పాన్స్‌ పొలిటికల్‌ హీట్‌ పుట్టించాయి కూడా. ఈ విషయం పక్కన పెడితే ఎప్పటిలాగే బాలయ్య తనదైన శైలి, మేనరిజంతో ఆకట్టుకున్నారు. బావ, అల్లుడితో కలిసి వినోదం పండించారు. మొదటి ఎపిసోడ్‌ సూపర్‌ హిట్‌ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి రెండో ఎపిసోడ్‌పై పడింది. ఈసారి బాలయ్య షోకు ఎవరు వస్తారోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈనేపథ్యంలో ఆహా యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ షేర్‌ చేసింది.

‘గెస్‌ ది గెస్ట్ ఆఫ్‌ ఎపిసోడ్‌-2’ అంటూ తర్వాతి ఎపిసోడ్‌కు వచ్చే గెస్టులెవరో గెస్‌ చేయండంటూ రెండు పజిల్స్‌ను షేర్‌ చేసింది ఆహా యాజమాన్యం. మొదటి పజిల్‌ను పరిశీలిస్తే డీజే టిల్లు భామ నేహా శెట్టి ఈ టాక్‌షోకు వస్తున్నారని దాదాపుగా అర్థమవుతుంది. ఫ్యాన్స్‌ కూడా అదే కామెంట్‌ చేస్తున్నారు. అయితే రెండో పజిల్‌ కాస్త క్లిష్టంగా ఉంది. అయితే అశోకవనంలో అర్జున కల్యాణంతో ఆకట్టుకున్న హీరో విశ్వక్ సేని అని కొందరు అంటుంటే, సిద్దూ జొన్నల గడ్డ అని మరికొందరు చెబుతున్నారు. మరి మీరూ ఈ పజిల్స్‌పై ఓ లుక్కేయండి. బాలయ్య షో తర్వాతి ఎపిసోడ్‌కు గెస్టులెవరో కనుక్కోండి చూద్దాం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..