Family Man 2 Telugu: ఫ్యామిలీ మ్యాన్‌ తెలుగు ఫ్యాన్స్‌ ఎదురుచూపులు ముగిసేది అప్పుడేనా.? తెలుగు వెర్షన్‌ ఎప్పుడంటే.

|

Aug 13, 2021 | 11:48 AM

Family Man 2 Telugu: ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌ దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓటీటీ వేదికగా విడుదలైన ఓ వెబ్‌ సిరీస్‌ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకోవడం బహుశా ఇదే తొలిసారి...

Family Man 2 Telugu: ఫ్యామిలీ మ్యాన్‌ తెలుగు ఫ్యాన్స్‌ ఎదురుచూపులు ముగిసేది అప్పుడేనా.? తెలుగు వెర్షన్‌ ఎప్పుడంటే.
Family Man 2 Telugu
Follow us on

Family Man 2 Telugu: ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌ దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓటీటీ వేదికగా విడుదలైన ఓ వెబ్‌ సిరీస్‌ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకోవడం బహుశా ఇదే తొలిసారి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదేమో. ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా విజయంతమైంది. భారీ బడ్జెట్‌తో వెబ్‌ సిరీస్‌లను తెరకెక్కించేందుకు ఎంతో మంది ఔత్సాహిక దర్శక, నిర్మాతలకు ఫ్యామిలీ మ్యాన్‌ స్ఫూర్తిగా నిలిచిందని చెప్పాలి. ఇక మొదటి సీజన్‌ సంచలన విజయంతో మేకర్స్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ను రెట్టింపు ఉత్సాహంతో తెరకెక్కించారు. ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ సిరీస్‌ కూడా సంచలన విజయం నమోదు చేసుకుంది. అయితే ఈ ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2ను మేకర్స్‌ తెలుగులో విడుదల చేయలేరు. రెండో సీజన్‌లో సమంత నటించడంతో తెలుగు ఆడియన్స్‌లోనూ ఈ సీజన్‌పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

అయితే సీజన్‌ 2 విడుదలై రెండు నెలలు గడుస్తోన్నా ఇప్పటి వరకు తెలుగు వెర్షన్‌ మాత్రం విడుదల కాలేదు. దీంతో ఆడియన్స్‌ ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు ప్రేక్షకుల ఎదురు చూపులకు ఫుల్‌ స్టాప్‌ పెడుతూ అమేజాన్‌ ఫ్యామిలీ మ్యాన్‌ సెకండ్‌ సీజన్‌ తెలుగు వెర్షన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే ఫ్యామిలీ మ్యాన్‌ తెలుగు వెర్షన్‌ విడుదల కానున్నట్లు సమాచారం. అయితే తేదీని మాత్రం చిత్ర యూనిట్‌ ఇంకా ప్రకటించలేదు. తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఎదురు చూస్తోన్న సీజన్‌ 2 త్వరలోనే స్ట్రీమింగ్ కానుందన్నమాట. ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌లో బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ భాజ్‌పాయ్‌ లీడ్‌ రోల్‌లో నటించగా, ప్రియమణి, సమంత ఇతర పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.

Also Read: Health Tips: పొంచి ఉన్న డెంగ్యూ ప్రమాదం.. వీటిని తీసుకుంటే గట్టెక్కినట్లే.. ఎంటో తెలుసా..

Covid 19: రానున్న రోజుల్లో కరోనా సాధారణ జలుబులా మారనుందా..? ఆసక్తికర విషయాలు వెల్లడించిన పరిశోధకులు.

Boycott RadhikaApte: రాధికా ఆప్టేను బహిష్కరించాలంటోన్న నెటిజన్లు. ట్రెండింగ్‌లో బైకాట్‌ రాధికా.. కారణమేంటో తెలుసా?