ఇప్పుడు మలయాళ సినిమాలకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఓటీటీల్లో మాలీవుడ్ సినిమాలకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఇటీవల తెలుగులోకి వచ్చిన మలయాళ కిష్కింద కాండం సినిమా ఇందుకు మరో నిదర్శనం. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో మలయాళ సినిమా రానుంది. పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ గ తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయాడు మలయాళ సూపర్ స్టార్ ఫహాద్ ఫాజిల్. ఇప్పుడు అతను ప్రధాన పాత్రలో నటించిన ఓ మలయాళ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రానుంది. అదే బౌగెన్ విల్లా. అక్టోబర్ 17న మలయాళంలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 35 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడీ బౌగెన్ విల్లా సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 13 నుంచి బౌగెన్ విల్లా సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు సోనీ లివ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో సినిమా పోస్టర్ ను కూడా షేర్ చేసుకుంది. కాగా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాష్లో బౌగెన్ విల్లా సినిమా అందుబాటులోకి రానుంది.
కాగా రుతింతే లోకం నవల ఆధారంగా దర్శకుడు అమల్ నీరద్ ఈ బౌగెన్ విల్లా సినిమాను తెరకెక్కించారు. ఫాహద్ ఫాజిల్ తో పాటు కుంచకో బోబన్, జ్యోతిర్మయి, వీనా నందకుమరా, షరాఫ్ యు ధీన్, శోభి తిలకన్, జినూ జోసెఫ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అమల్ నీరద్ ప్రొడక్షన్స్ ఉదయా పిక్చర్స్ బ్యానర్లపై జ్యోతి ర్మయి, కుంచకో బోబన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.సుశిన్ శ్యామ్ స్వరాలు సమకూర్చారు.
Every petal tells a story, every twist leaves you guessing. #Bougainvillea blooms this 13th December only on #SonyLIV.#Bougainvillea #BougainvilleaOnSonyLIV #SonyLIV #AmalNeerad #KunchackoBoban #Jyothirmayi #FahadFaasil #Srindaa #VeenaNandakumar #Sharafudheen pic.twitter.com/NdXQkBMWiZ
— Sony LIV (@SonyLIV) November 30, 2024
#Bougainvillea OTT Release From Dec 13th #fahadhFaasil Back to Back 💯🔥
Waiting Sir 👍🔥
Pan india Film. 5 Language 🙌 pic.twitter.com/Ixzar38QdX— im.pratheesh (@KettavaN6474) November 30, 2024
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.