Unstoppable Season 4: బాలయ్యతో కలిసి తొడకొట్టిన స్టార్ హీరో.. అన్‌స్టాపబుల్ స్టేజ్ పై దుల్కర్ సల్మాన్ సందడి..

మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం లక్కీ భాస్కర్ సినిమాతో మల్లీ థియేటర్లలో సందడి చేయబోతున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆహా ఓటీటీలో ప్రసారం కానున్న బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు.

Unstoppable Season 4: బాలయ్యతో కలిసి తొడకొట్టిన స్టార్ హీరో.. అన్‌స్టాపబుల్ స్టేజ్ పై దుల్కర్ సల్మాన్ సందడి..
Balakrishna
Follow us

|

Updated on: Oct 29, 2024 | 9:15 PM

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్‏గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. మొదటిసారి డిజిటల్ ప్లాట్ ఫామ్ పై హోస్ట్‏గా రఫ్పాడించారు బాలయ్య. ఇప్పటికే ఈ షో విజయవంతంగా మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. గత సీజన్స్ అత్యధిక వ్యూస్ తో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అన్‌స్టాపబుల్ సీజన్ 4 గ్రాండ్ గా ప్రారంభమయ్యింది. ఇటీవలే ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేశారు. బావతో కలిసి బాలయ్య ఎన్నో విషయాలను బయటపెట్టారు. అలాగే జనాలకు కావాల్సిన ప్రశ్నలు, సమాధానాలను ఈ షోలో అడిగి తెలుసుకున్నారు. ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత సెకండ్ ఎపిసోడ్ అతిథి ఎవరనే విషయం తెలుసుకునేందుకు అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

ఇక రెండో ఎపిసోడ్ కోసం మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వస్తున్నట్లు ఇదివరకే రివీల్ చేసింది ఆహా. ప్రస్తుతం లక్కీ భాస్కర్ సినిమాలో నటిస్తున్న హీరో.. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోలో సందడి చేసింది ఈ మూవీ టీం. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, నాగ వంశీ, డైరెక్టర్ వెంకీ అట్లూరి అతిథులుగా వచ్చారు.

ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ప్రోమో అదిరిపోయింది. లక్కీ భాస్కర్ టీంతో ఫన్ ముచ్చట్లు, గేమ్స్ అంటూ నవ్వులు పూయించారు బాలయ్య. అనంతరం ఈ ఎపిసోడ్ కు సంబంధించిన కొన్ని ఫోటోస్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అందులో దుల్కర్ సల్మాన్, బాలయ్య ఇద్దరూ తొడ కొడుతున్న ఫోటో నెట్టింట వైరలవుతుంది.

ఇది చదవండి : Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..

Arjun Reddy: తస్సాదియ్యా.. ఏం మేకోవర్ భయ్యా.. ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీని ఇప్పుడు చూస్తే ప్రేమలో పడాల్సిందే..

Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్‍ లుక్‏లో తారక్.. వేరేలెవల్ అంతే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.