అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలో భారత్ చారిత్రక విజయం సాధించింది. ఒక్కటి కాదు ఈసారి ఏకంగా రెండు ఆస్కార్ అవార్డ్స్ కైవసం చేసుకుంది. ముందుగా బెస్ట్ షార్ట్ ఫిల్మ్ డాక్యుమెంటరీ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డ్స్ అందుకుంది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గెలుచుకుంది. అయితే బెస్ట్ షార్ట్ ఫిల్మ్ గా నిలిచిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దీనికి కార్తీకి గోసోల్వస్ దర్శకత్వం వహించారు. గునీత్ మోంగా నిర్మించారు. తమిళనాడులోని ముతుమలై నేషనల్ పార్కులో బొమన్, బెల్లి ప్రధాన పాత్రలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. బొమన్, బెల్లీ సంరక్షణలో పెరిగి రఘు అనే పిల్ల ఏనుగు కథే ఈ ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రం. వారి మధ్య సాగే ఆత్మీయ అనుబంధంతోపాటు.. ప్రకృతి అందాలను సినిమాలో అందంగా చూపించారు.
ఈ డాక్యుమెంటరీ నిడివి 45 నిమిషాలు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ తర్వాత ఈ చిత్రానికి మరింత రెస్పాన్స్ వస్తుంది. ఆస్కార్ మాత్రమే కాదు.. ఈ చిత్రం మరిన్ని అవార్డ్స్ అందుకుంది. ఓ డాక్యుమెంటరీని ఐదేళ్ల పాటు తెరకెక్కించడం ఏంటనే విషయాన్ని ఆశ్చర్యంగా చెప్పుకున్నారు జనాలు.
వన్యమృగాలు మనకు చేటు చేయవని, వాటి జీవనశైలికి తగ్గట్టు వాటిని వదిలేయాలని చెప్పిన డాక్యుమెంటరీ ఇది. వాటితో స్నేహం చేస్తే కుటుంబంలో ఒకరిలా కలిసిపోతాయని చూపించింది.
We’re not sure if it’s a coincidence or something divine. We’re not sure how it’s possible and we can’t even begin to calculate the chances of it happening but…
…TODAY IS NATIONAL ELEPHANT DAY ?#TheElephantWhisperers pic.twitter.com/4V8OwF7uLv
— Netflix India (@NetflixIndia) March 13, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.