OTT Movies: ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్ ధమాకా.. ఈ వారం ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మూవీస్ ఇవిగో..

మార్చి మూడో వారం వచ్చేసింది. పరీక్షల సమయం కూడానూ.. ఈ తరుణంలో సినిమాలు పెద్దగా రిలీజ్ కావు.. కానీ ఇందుకు విరుద్దంగా..

OTT Movies: ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్ ధమాకా.. ఈ వారం ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మూవీస్ ఇవిగో..
Ott Movies
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 14, 2023 | 9:54 AM

మార్చి మూడో వారం వచ్చేసింది. పరీక్షల సమయం కూడానూ.. ఈ తరుణంలో సినిమాలు పెద్దగా రిలీజ్ కావు.. కానీ ఇందుకు విరుద్దంగా అటు థియేటర్లు.. ఇటు ఓటీటీల్లోకి పలు బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలు క్యూ కట్టాయి. బుల్లితెరపై ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు థియేటర్లలలో సందడి చేసిన సూపర్ హిట్ మూవీస్.. ఈ వారం ఓటీటీల్లోకి అడుగుపెట్టబోతున్నాయ్. మరి అవేంటో చూసేద్దాం..

రైటర్ పద్మభూషణ్:

సుహాస్ ప్రధాన పాత్రలో షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. ఆశీష్ విద్యార్థి, రోహిణి, టీనా శిల్పరాజ్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం.. చిన్న సినిమాగా ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన తొలి రోజు నుంచే అద్భుతమైన టాక్ తెచ్చుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. సుహాస్ నటనకు మరోసారి విమర్శకుల ప్రశంసలు అందాయి. ఇక ఇప్పటివరకు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ జీ5లో ఈ నెల 17వ తేదీ నుంచి ‘రైటర్ పద్మభూషణ్’ స్ట్రీమింగ్ అవుతుంది.

సార్:

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ తొలి స్ట్రెయిట్ తెలుగు మూవీ ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకుడు కాగా, సంయుక్తా మీనన్ హీరోయిన్. స‌ముద్రఖ‌ని, హైప‌ర్ ఆది, తనికెళ్ళ భరణి, అక్కినేని సుమంత్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించారు. ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వరద పారించింది. రూ.100 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఓటీటీని ఏలేందుకు వచ్చేస్తోంది. ఈ నెల 17వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

సత్తిగాని రెండెకరాలు:

‘పుష్ప’ స్నేహితుడిగా నటనకు గానూ మంచి మార్కులు కొట్టేసిన జగదీశ్ ప్రతాప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సత్తిగాని రెండెకరాలు’. దీనికి అభినవ్ రెడ్డి దర్శకుడు. వెన్నెల కిశోర్ .. మోహనశ్రీ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్న ఈ మూవీ మార్చి 17వ తేదీ నుంచి ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

వీటితో పాటు డ్వేయాన్ జాన్సన్ నటించిన ‘బ్లాక్ ఆడమ్’ మూవీ మార్చి 15 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో.. హీరోయిన్ టబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కుత్తే’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా మార్చి 16 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.