పెట్టింది రూ. 20కోట్లు.. వచ్చింది రూ. 182 కోట్లు..! చిన్న సినిమా అనుకుంటే చరిత్ర సృష్టించింది..

ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏లలో కొన్నాళ్లుగా హారర్ కంటెంట్ చిత్రాలు అధికంగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, ఆసక్తిని రేకెతెత్తించే వెబ్ సిరీస్ నిత్యం సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా హారర్ జోనర్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది .

పెట్టింది రూ. 20కోట్లు.. వచ్చింది రూ. 182 కోట్లు..! చిన్న సినిమా అనుకుంటే చరిత్ర సృష్టించింది..
Ott

Updated on: Jan 27, 2026 | 1:16 PM

ఎన్ని రకాల సినిమాలు వచ్చినా..  హారర్ సినిమాలకు మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆడియన్స్ లో చాలా మంది దెయ్యాల సినిమాలు చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎలాంటి హారర్ సినిమాలు వచ్చిన వదిలిపెట్టకుండా చూస్తుంటారు. ఇక కొంతమంది భయమేసిన కళ్లు మూసుకుంటునైనా సినిమాను చూస్తూ ఉంటారు. ఓటీటీలో భయపెట్టే సినిమాలు చాలానే ఉన్నాయి. హాలీవుడ్ ను మించి హారర్ సినిమాలు మన దగ్గర చాలానే ఉన్నాయి. హారర్ కామెడీ సినిమాలు కొన్నున్నాయి. అలాగే కంపీల్ట్ హారర్ మూవీస్ కూడా ఉన్నాయి.  ఓటీటీల్లో హారర్ సినిమాలు చూసేవారి సంఖ్య కూడా ఎక్కువే. అందులోనూ దెయ్యం కాన్సెప్ట్‌తో వచ్చే స్టోరీలు అయితే.. మూవీ లవర్స్ తెగ ఎంజాయ్ చేస్తారు.

మరి దెయ్యంతో పాటు కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటే.. అలాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఒకటి ఇప్పుడు చెప్పబోతున్నాం. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ అసలేంటి.? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం..! ఆ సినిమా ఎదో కాదు బాలీవుడ్ లో తెరకెక్కిన స్త్రీ. శ్రాద్ధకపూర్, రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ బాలీవుడ్ లో నయా రికార్డ్ క్రియేట్ చేసింది. కలెక్షన్స్ కుమ్మేసింది. ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. కామెడీ హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ సినిమా ఓ వైపు నవ్విస్తూనే మరోవైపు.. భయపెడుతుంది. ఈ సినిమాలోని హారర్ సీన్స్ భయంతో వణికిపోయేలా చేస్తాయి. స్త్రీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.182 కోట్ల వసూళ్లు వచ్చాయి. గత ఏడాది ఈ సినిమాకు సీక్వెల్ కూడా వచ్చింది. స్త్రీ 2 సినిమా కూడా ఘనవిజయం సాధించింది. ఆ సినిమా ఏకంగా రూ. 800కోట్లు కలెక్షన్లు సాధించి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా స్త్రీ సినిమా ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. సినిమా వచ్చి 8 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది ఈ మూవీ. అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..