
ఇన్నాళ్లు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోయిన ఒక సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండ్ అవుతుంది. దాదాపు 2 గంటల 35 నిమిషాల నిడివి గల ఈ మూవీకి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి, ప్రియాంక చోప్రా, అర్జున్ దాస్, శ్రియ రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 1940ల నాటి కథతో అద్భుతమైన విజువల్ వండర్ అందించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్, మేనరిజం చూసి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
ఓజాస్ పాత్రలో నటించిన పవన్ కళ్యాణ్ తన కోల్పోయిన వారసత్వాన్ని తిరిగి పొంది.. తన సహచరుల వల్ల కలిగే ప్రమాదాన్ని ఆపడానికి తిరిగి వస్తాడా.. ? ఆ తర్వాత కథ ఎటు మలుపు తిరిగింది అనేది సినిమా. ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ నుంచి షూటింగ్ వరకు.. మూవీలోని ప్రతిదీ మనసును కదిలిస్తుంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అయితే స్ట్రీమింగ్ అయిన వెంటనే ఈ సినిమా ట్రెండింగ్ లో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతుంది.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
ఈ చిత్రానికి IMDBలో 6.7 రేటింగ్ పొందింది. ఇన్నాళ్లు థియేటర్లలో సత్తా చాటిన ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో మాస్ రచ్చ కొనసాగిస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ అందించిన మ్యూజిక్ మరో హైలెట్ అయ్యింది. మెగా అభిమానులకు మంచి ఊపు అందించాలే మ్యూజిక్ ఇచ్చారు తమన్.
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..