Maestro: ఈ సినిమా తర్వాత రీమేక్ జోలికి అస్సలు వెళ్లను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన మాస్ట్రో డైరెక్టర్..

|

Sep 14, 2021 | 9:39 AM

నితిన్, నభా నటేష్ జంటగా నటిస్తున్న సినిమా మాస్ట్రో. బాలీవుడ్‏లో సూపర్ హిట్ అయిన అంధాదున్ సినిమాకు తెలుగు రీమేక్‏గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ మేర్లపాక గాంధీ.

Maestro: ఈ సినిమా తర్వాత రీమేక్ జోలికి అస్సలు వెళ్లను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన మాస్ట్రో డైరెక్టర్..
Merlapaka Gandhi
Follow us on

నితిన్, నభా నటేష్ జంటగా నటిస్తున్న సినిమా మాస్ట్రో. బాలీవుడ్‏లో సూపర్ హిట్ అయిన అంధాదున్ సినిమాకు తెలుగు రీమేక్‏గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ మేర్లపాక గాంధీ. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 17న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా.. మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఈ సినిమా నుంచి వరుసగా పోస్టర్స్, సాంగ్స్ విడుదల చేస్తూ.. మూవీ పై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా.. డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

డైరెక్టర్ మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. ఒక కథ అనుకుని కొన్ని నెలలు ప్రయాణం చేశాక మరో మంచి ఆలోచన వస్తుంది. ఆ తర్వాత మళ్లీ దానిపై దృష్టి పెడుతుంది. అలా సినిమా పట్టాలెక్కించడం ఆలస్యం అవుతుంది. మాస్ట్రోని మాత్రం కేవలం 42 రోజుల్లోనే పూర్తి చేశా. అంధాదున్ చూడగానే సినిమాలోని థ్రిల్లింగ్ అంశాలు నచ్చాయి. నేర నేపథ్యం, కామెడి నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. రీమేక్ చేస్తే ఇలాంటి సినిమా చేయాలనిపించింది. ఇక అదే సమయంలో నిర్మత సుధాకర్ రెడ్డి, హీరోయ నితిన్ సంప్రదించడంతో ఈ సినిమా చేశా. అసలైన సినిమాలోని ప్రేమకథలో చిన్న చిన్న మార్పులు చేశాం. సినిమా చూసుకున్నాక నితిన్ సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరోసారి నితిన్‏తో సినిమా చేస్తా అని చెప్పుకొచ్చారు గాంధీ.

ఇక రీమేక్ సినిమా విషయానికి వస్తే.. చేయడం కొంచెం కష్టమే.. ఉన్నది ఉన్నట్టుగా తీస్తే కాపీ అంటారు. మార్పులు చేస్తే ఆత్మని చంపేశారంటారు. ఎప్పుడైనా.. ఎక్కడైనా ఈ సమస్య మాత్రం కచ్చితం. అందుకే ఒరిజినల్ అనుభూతి .. ఇందులోనూ పక్కాగా కనిపించాలని కొన్ని సన్నివేశాలను ఉన్నవి ఉన్నట్టుగా చేశాం. ఎలా చేసినా రీమేక్‌ అనగానే పోల్చి చూడటం మొదలవుతుంది. అందుకే ఈ సినిమా తర్వాత రీమేక్‌ చేయకూడదని నిర్ణయించా. ‘మాస్ట్రో’ అంటే మాస్టర్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ అని అర్థం అంటూ చెప్పుకొచ్చారు గాంధీ. మాస్ట్రో సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి.. రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మిస్తున్నారు.

Also Read: Paata Uttej: నా భవిష్యత్తుని ఇలా వదిలేశావ్ ఏంటమ్మ.. కన్నీరు పెట్టిస్తున్న ఉత్తేజ్ కూతురి పోస్ట్..

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్‏లో మొదటి ఎలిమినేషన్‏లో సరయును అందుకే తప్పించారా ? వారానికే అంత పారితోషికమా ?