Dil Se OTT: ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్‌ తెలుగు వెబ్‌ సిరీస్‌.. ‘దిల్‍సే’ స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

|

Sep 11, 2023 | 7:20 AM

ఓటీటీలో వెబ్‌ సిరీస్‌లకు క్రమంగా క్రేజ్‌ పెరుగుతోంది. ఆడియెన్స్‌ కూడా వీటిని చూసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పలు ఓటీటీ సంస్థలు సరికొత్త కంటెంట్‌తో సినిమాలు, సిరీస్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇటీవల తెలుగులోనూ వెబ్‌ సిరీస్‌లకు ఆదరణ పెరుగుతోంది. ఏటీఎమ్‌, సైతాన్‌, దయ తదితర సిరీస్‌లకు సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇదే కోవలో మరిన్ని తెలుగు వెబ్‌ సిరీస్‌లు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.

Dil Se OTT: ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్‌ తెలుగు వెబ్‌ సిరీస్‌.. దిల్‍సే స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
Dil Se Web Series
Follow us on

ఓటీటీలో వెబ్‌ సిరీస్‌లకు క్రమంగా క్రేజ్‌ పెరుగుతోంది. ఆడియెన్స్‌ కూడా వీటిని చూసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పలు ఓటీటీ సంస్థలు సరికొత్త కంటెంట్‌తో సినిమాలు, సిరీస్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇటీవల తెలుగులోనూ వెబ్‌ సిరీస్‌లకు ఆదరణ పెరుగుతోంది. ఏటీఎమ్‌, సైతాన్‌, దయ తదితర సిరీస్‌లకు సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇదే కోవలో మరిన్ని తెలుగు వెబ్‌ సిరీస్‌లు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌ ‘దిల్‌ సే’ పేరుతో నయా వెబ్ సిరీస్‌ను స్ట్రీమింగ్‌ కానుంది. అర్బన్‌ లవ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో ఛాయ్‌ బిస్కెట్‌ ఫేమ్ రాజా విక్రమ్‌, వర్ష కీలక పాత్రలు పోషించారు. అలాగే భార్గవ్, రోహిణి రావు, రాహుల్ వర్మ, రమణ భార్గవ, వీవీ కృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న దిల్‌ సే వెబ్‌ సిరీస్‌ సెప్టెంబర్‌ 16 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సిరీస్‌ టీజర్‌ను కూడా రిలీజ్‌ చేసింది. ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వెళ్లిన హర్ష (రాజా విక్రమ్‌) పెద్ద నగరంలో ఎలా ఉంటాడోనని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. అదే సమయంలో ఓ కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగంలో చేరాక సిటీ కల్చర్‌కు బాగా అలవాటు పడిపోతాడు హర్ష. స్నేహితులతో మందు తాగడం, అల్లరి చేయడం లాంటివి చేస్తాడు. ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం కూడా నడపడం.. ఇలా ఆసక్తికర సన్నివేశాలతో దిల్‌ సే టీజర్‌ సాగింది.

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా..

భరత్ నరేన్‌ తెరకెక్కించిన దిల్‌ సే వెబ్‌ సిరీస్‌లో మొత్తం 12 ఎపిసోడ్లు ఉండనున్నాయి. శ్రీ అక్కియాన్ మారిస పతాకంపై శ్రీధర్ మారిస ఈయూత్‌ ఫుల్‌ వెబ్‌ సిరీస్‌ను నిర్మించారు. రాజ్ మేడా, కిరణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా, ప్రియాంక సూరంపూడి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించారు. అజయ్‌ అరసాడ స్వరకర్త కాగా, అనుష్క కుమార్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.

ఇవి కూడా చదవండి

‘దిల్‍సే’ వెబ్ సిరీస్ టీజర్

‘దిల్‍సే’ వెబ్ సిరీస్ కొత్త పోస్టర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.