బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకున్న సినిమాలు రెండు నెలల రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే వాల్తేరు వీరయ్య, వీర సింహరెడ్డి చిత్రాలు ఓటీటీ ప్లాట్ ఫాం వేదికగా సినీ ప్రియులను అలరిస్తున్నాయి. తాజాగా మరో రెండు హిట్ చిత్రాలు ఓటీటీలోకి వచ్చేశాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న ఆ రెండు ఫీల్ గుడ్ సినిమాలు ఇప్పుటు డిజిటల్ ప్లాట్ ఫాంలో సందడి చేస్తున్నాయి. అవెంటంటే.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన ద్విభాషా చిత్రం సార్.. కాగా మరోకటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్. ఈ రెండు సినిమాలు మార్చి 17 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తొలిసారిగా నేరుగా తెలుగులో నటించిన చిత్రం సార్. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ సంయుక్త మేనన్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. సముద్రఖని, హైపర్ ఆది, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన సార్ సినిమా ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై సక్సెస్ అయ్యింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో భారీగా రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
అలాగే కలర్ ఫోటో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం రైటర్ పద్మభూషణ్. రైటర్‌గా ఎదగాలనుకుంటున్న యువకుడు.. తన మరదలితో ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి కుదురుతుంది. అంతలోనే మరో వ్యక్తి ఆ అబ్బాయి పేరు మీద రచనలు చేస్తుంటాడు. అదేవెరనేదే సినిమాలో ప్రధానమైన అంశం. ఇటీవల థియేటర్స్‌లో విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.