
సాధారణంగా సినీప్రియులకు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ పై ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. వివిధ రకాల ఫేజ్ లతో ఎన్నో ఫ్రాంఛైజీ సినిమాలు, సిరీస్ లను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఎమ్సీయూ నుంచి వచ్చిన డేర్ డెవిల్ వెబ్ సిరీస్ కు సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు ఈ వెబ్ సిరీస్ లో మూడు సిరీస్ లు వచ్చాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సిరీస్ గా రూపొందించిన ఈ డేర్ డెవిల్ 3 సీజన్స్ వరకు అడియన్స్ ను ఆకట్టుకుంది. 2018లో డేర్ డెవిల్ 3 వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్ నుంచి నాలుగో సీజన్ గా ఏడేళ్లకు డేర్ డెవిల్ బార్న్ అగైన్ టైటిల్ తో మరో సీజన్ వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో ఈ సిరీస్ మార్చి 5 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం మొత్తం నాలుగు భాషలలో ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సిరీస్ మొదటి రెండు ఎపిసోడ్స్ మాత్రమే డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. కాగా ఈ సిరీస్ లో మొత్తం 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. తదుపరి ఎపిసోడ్‌లు ప్రతి మంగళవారం విడుదలవుతాయి. ఈ షెడ్యూల్ మాట్ ముర్డాక్ కాథలిక్ నేపథ్యాన్ని ప్రతిబింబిస్తూ లెంట్ సీజన్‌కు అనుగుణంగా ఉంటుంది. ఈ సిరీస్‌లో మార్చి 4, 2025 నుండి ఏప్రిల్ 15, 2025 వరకు వారానికి విడుదలయ్యే తొమ్మిది ఎపిసోడ్‌లు ఉంటాయి.
ఇందులో పనిషర్ సిరీస్ హీరో కనిపించడం మరింత హైలెట్ గా నిలిచింది. డేర్ డెవిల్ 4లో మ్యాట్ మర్డోక్ తన శత్రువు అయిన కింగ్ పిన్ తో కలిసి మరో శత్రువు కోసం పని చేయనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..