AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digangana Suryavanshi: నిర్మాతను మోసం చేసిన టాలీవుడ్ హీరోయిన్.. డబ్బులు తీసుకుని బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు..

ఇటీవలే డైరెక్టర్ కమ్ షో నిర్మాత మనీష్ హరిశంకర్ ఓ మీడియా పోర్టల్‌తో మాట్లాడుతూ.. సిరీస్ ఆగిపోలేదని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలిపారు. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేస్తామని అన్నారు. ఈ క్రమంలోనే ఈ సిరీస్ లో ముఖ్య పాత్ర పోషించిన హీరోయిన్ దిగంగన సూర్యవంశీపై మేకర్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Digangana Suryavanshi: నిర్మాతను మోసం చేసిన టాలీవుడ్ హీరోయిన్.. డబ్బులు తీసుకుని బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు..
Digangana Suryavanshi
Rajitha Chanti
|

Updated on: Jun 11, 2024 | 4:15 PM

Share

టాలీవుడ్ హీరోయిన్ దిగంగన సూర్యవెంశీపై ప్రముఖ నిర్మాత మనీశ్ హరిశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు తీసుకుని తమను మోసం చేసిందని.. అంతేకాకుండా తమను బెదిరిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే.. బాలీవుడ్ లెజెండరీ నటి జీనత్ అమన్ సినీ పరిశ్రమలోకి రీఎంట్రీ ఇస్తుంది. ఆమె నటిస్తోన్న వెబ్ సిరీస్ షోస్టాపర్. ఈ సిరీస్ అనౌన్స్ చేసి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు స్ట్రీమింగ్ కాలేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సిరీస్ ఆగిపోయిందని ప్రచారం జరిగింది. అయితే ఇటీవలే డైరెక్టర్ కమ్ షో నిర్మాత మనీష్ హరిశంకర్ ఓ మీడియా పోర్టల్‌తో మాట్లాడుతూ.. సిరీస్ ఆగిపోలేదని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలిపారు. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేస్తామని అన్నారు. ఈ క్రమంలోనే ఈ సిరీస్ లో ముఖ్య పాత్ర పోషించిన హీరోయిన్ దిగంగన సూర్యవంశీపై మేకర్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

షో స్టాపర్ ప్రాజెక్ట్ కోసం హీరో అక్షయ్ కుమార్ తోపాటు.. అతడి నిర్మాణ కంపెనీని ఈ సిరీస్ సమర్పకులుగా వ్యవహరించేందుకు ఒప్పిస్తానని దిగంగన ప్రగల్బాలు పలికిందట. తనకు బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్స్ అక్షయ్ కుమార్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి హీరోలతో పరిచయాలు ఉన్నాయని.. ఈ ప్రాజెక్టులో వారిని కూడా భాగం చేస్తానని నమ్మించిందట. ఇందుకు తమ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని చివరకు మోసం చేసిందని ఎమ్హెచ్ ఫిలింస్ బ్యానర్ సంస్థ ఆరోపిస్తుంది. అంతేకాకుండా తన డిమాండ్స్ నెరవేర్చకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిర్మాత హరిశంకర్ ను బెదిరించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు హరిశంకర్ తరపు న్యాయవాది ఫాల్గుని బ్రాహ్మభట్.

ఇవే కాకుండా షోస్టాపర్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని.. మేకర్స్ సరిగ్గా పేమెంట్స్ ఇవ్వండ లేదంటూ తమపై అసత్య ఆరోపణలు చేసి తమ బ్యానర్ ప్రతిష్ట దిగజార్చారంటూ నటుడు రాకేశ్ బేడీ, దిగంగన సూర్యవంశీ ఫ్యాషన్ డిజైనర్ కృష్ణన్ పార్మర్ పై కూడా నిర్మాత పరువు నష్టం దావా వేశారు. షో స్టాపర్ సిరీస్ లో జీనత్ అమన్ తోపాటు.. జరీనా వాహబ్, శ్వేత తివారి, దిగంగన సూర్యవంశీ, సౌరభ్ రాజ్ జైన్ ప్రధాన పాత్రలలో నటించారు. తెలుగులో దిగంగన సూర్యవంశీ సిటీమార్, క్రేజీఫెలో, హిప్పి, వలయం చిత్రాల్లో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.