ఆహా.. తెలుగు సినీ ప్రియులకు ఎప్పటికప్పుడు ఆన్ లిమిటెడ్ వినోదాన్ని అందిస్తూ డిజిటల్ రంగంలో దూసుకుపోతుంది. టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాలనే కాకుండా.. ఇతర భాషల్లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాలను డబ్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకువస్తుంది. అలాగే గేమ్ షోస్, టాక్ షోస్, కుకింగ్ సోష్ అంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ప్రస్తుతం అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోతో యాంకర్‌గా నందమూరి బాలకృష్ణలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన ఆహా.. ఇప్పుడు సరికొత్త షోను లాంచ్ చేస్తుంది. కామెడీ స్టాక్ ఎక్సేంజ్ పేరుతో మరో షోను స్టార్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్‌తో టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓటీటీలోకి అడుగుపెట్టనున్నారు. వరుస విజయాలతో ఇండస్ట్రీలో అపజయమేరుగని దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ .. ఇప్పుడు కామెడీ స్టాక్ ఎక్సేంజ్ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించబోతున్నారు.
ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఈ కామెడీ షో నవంబర్ నుంచి ప్రారంభం కాబోతుందని ఆహా ప్రకటించింది. ఈ షోను ఎస్ఓఎల్ ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోంది. స్టేజీల మీద కామెడీ చేసి ప్రేక్షకులను తమవైన మాటలతో కడుపుబ్బా నవ్వించేవారికి పెద్ద పీట వేస్తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు విశేషమైన స్పందన వస్తోంది. ఈషోతోనే సుడిగాలి సుధీర్ ఓటీటీలోకి అడుగుపెట్టనున్నారు. అలాగే వేణు, ముక్కు అవినాష్, సద్దాం, ఎక్స్ ప్రెస్ హరి, భాస్కర్, జ్ఞానేశ్వర్ వంటి వాళ్లు ప్రేక్షకులకు చూపించని కోణాన్ని పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు.
ప్రతిభావంతులైన నటులతో కామెడీ స్టాక్ ఎక్సేంజ్ కి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆద్యంతం నవ్వించే ఈ షోకు నేను కూడా భాగం కావడం సంతోషంగా ఉంది. నా ఓటీటీ డెబ్యూ ఇది. ప్రేక్షకులందరూ ఆనందంగా ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాను అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. అతి త్వరలోనే ఆహాలో రాబోతున్న కామెడీ స్టాక్ ఎక్సేంజ్ చూసి కడుపుబ్బా నవ్విందేకు సిద్ధంగా ఉండండి.
Ayyoru occhinaru!!!
Telugu cinema lo comedy definitionu, destinationu rendu marchina mana @AnilRavipudi garu Comedy Stock Exchange chairman ga badhyathalu sweekarincharahoooo??#CSEOnAHA Coming soon! pic.twitter.com/D8oD6IfdtT— ahavideoin (@ahavideoIN) October 26, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.