Pihu OTT: ఓటీటీలో సూపర్బ్ థ్రిల్లింగ్ మూవీ.. పిల్లలున్నవారు కచ్చితంగా చూడాల్సిందే.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

|

Jun 09, 2024 | 6:04 PM

ఓటీటీలో ఒక ఛైల్డ్ బేస్డ్ సినిమా సంచలనం సృష్టిస్తోంది. అలాగనీ ఇదేమీ సాధారణ పిల్లల సినిమా కాదు. పెద్దలు మరీ ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారు కచ్చితంగా చూడాల్సిన మూవీ. ఆద్యంతం ఆసక్తి కలిగించే కథా, కథనాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఆ సినిమా పేరు పిహు. ప్రస్తుతం ఓటీటీలో ఉన్న బెస్ట్ సినిమాల్లో ఇది ఒకటి.

Pihu OTT: ఓటీటీలో సూపర్బ్ థ్రిల్లింగ్ మూవీ.. పిల్లలున్నవారు కచ్చితంగా చూడాల్సిందే.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
Pihu Movie
Follow us on

ఓటీటీలన్నాక అన్ని జానర్ల సినిమాలు ఉంటాయి. క్రైమ్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, హారర్. .ఇలా అన్ని జానర్లకు సంబంధించిన సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే వీటిలో కొన్ని సినిమాలు మాత్రమే మనకు నచ్చుతాయి. మిగతావి పెద్దగా నచ్చకపోవచ్చు. ఇదిలా ఉంటే ఓటీటీలో ఒక ఛైల్డ్ బేస్డ్ సినిమా సంచలనం సృష్టిస్తోంది. అలాగనీ ఇదేమీ సాధారణ పిల్లల సినిమా కాదు. పెద్దలు మరీ ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారు కచ్చితంగా చూడాల్సిన మూవీ. ఆద్యంతం ఆసక్తి కలిగించే కథా, కథనాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఆ సినిమా పేరు పిహు. ప్రస్తుతం ఓటీటీలో ఉన్న బెస్ట్ సినిమాల్లో ఇది ఒకటి. 2018లో రిలీజైన ఈ సినిమాను కేవలం 45 లక్షల బడ్జెట్ లో తీశారు. కానీ సినిమా మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక పిహు మూవీ కథ విషయానికి వస్తే.. పిహు (మైరా విశ్వకర్మ) అనే రెండేళ్ల పాప చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. ఉదయాన్నే లేచి చూసేసరికి పిహు తల్లి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. కానీ పాప మాత్రం.. అమ్మ ఇంకా నిద్రపోతుందేమో అని భావిస్తుంది. తల్లిని నిద్రలోంచి లేపడానికి పాప ప్రయత్నించినా లేవదు. ఇక పిహు చిన్న పిల్ల కావడంతో ఇల్లంతా తిరుగుతుంది. అల్లరి పనులు చేస్తుంది. ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, గ్యాస్ సిలిండర్, వాటర్ ఫిల్టర్, ఐరన్ బాక్స్ తదితర ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువులన్నింటి స్విచ్‌లన్నింటినీ ఆన్ చేసి పెట్టేస్తుంది. దీంతో అక్కడి పరిస్థితి అత్యంత భయానకంగా మారుతంది.

మరి ఇలాంటి విషమ పరిస్థితుల నుంచి పిహు ఎలా బయటపడింది? అసలు పిహు తల్లి బతికే ఉందా? లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు. ఈ సినిమా మొత్తం ఒకే ఇంట్లోనే షూట్ చేశారు. అయినా ఎక్కడా బోర్ కొట్టదు. పిహు చేసే అల్లరి పనులతో తర్వాత ఏం జరుగుతుందోనని మన మైండ్ మనల్ని వెంటాడుతుంటుంది. పిహు పాత్రలో మైరా విశ్వకర్మ జీవించింది. ఆమె తల్లి పాత్రలో ప్రేరణ శర్మ నటించారు. ఇంట్లో పిల్లలున్నవారు ఎలా ఉండాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు, గ్యాస్ సిలిండర్ వంటి ప్రమాదకర వస్తువులతో ఆడడం ఎంత ప్రమాదమో ఈ సినిమాలో చక్కగా చూపించారు.

ఇవి కూడా చదవండి

 

 

ప్రస్తుతం పిహు మూవీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి కేవలం హిందీ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సినిమాలో డైలాగ్స్ తక్కువగా ఉండడం, సబ్ టైటిల్స్ కూడా అందుబాటులో ఉండడం వల్ల సినిమాఈజీగా అర్థమవుతుంది. సో.. మరెందుకు లేటు వెంటనే పిహు సినిమాను చూసేయండి. మరీ ముఖ్యంగా ఇంట్లో పిల్లలున్న వారు అసలు ఈ సినిమాను మిస్ అవద్దు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.