Dear Nanna OTT: ఫాదర్స్‌ డే స్పెషల్.. డైరెక్టుగా ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ‘డియర్ నాన్న’ మూవీ.. ఎప్పుడంటే?

|

Jun 12, 2024 | 4:34 PM

కీడా కోలా', 'అన్నపూర్ణ స్టూడియో ', 'వాలంటైన్స్ నైట్స్' 'షరతులు వర్తిస్తాయి' తదితర సినిమాల్లో హీరోగా తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరవయ్యాడు. ఇటీవలే 'పారిజాత పర్వం' అనే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ తో మన ముందుకు వచ్చాడు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ ఇవాళే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

Dear Nanna OTT: ఫాదర్స్‌ డే స్పెషల్.. డైరెక్టుగా ఆహాలో స్ట్రీమింగ్ కానున్న డియర్ నాన్న మూవీ.. ఎప్పుడంటే?
Dear Nanna Movie
Follow us on

యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ యాక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టాడు చైతన్య రావు. ’30 వెడ్స్ 20′ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘కీడా కోలా’, ‘అన్నపూర్ణ స్టూడియో ‘, ‘వాలంటైన్స్ నైట్స్’ ‘షరతులు వర్తిస్తాయి’ తదితర సినిమాల్లో హీరోగా తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరవయ్యాడు. ఇటీవలే ‘పారిజాత పర్వం’ అనే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ తో మన ముందుకు వచ్చాడు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ ఇవాళే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో పారిజాత పర్వం స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే మరో రెండు రోజుల గ్యాప్ లోనే మరో ఎమోషనల్ మూవీతో మన ముందుకు రానున్నాడు చైతన్య రావు. అదే డియర్ నాన్న. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ మూవీలో సీనియర్ నటుడు సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న డియర్ నాన్న డైరెక్టుగా ఓటీటీలోకి రానుంది. జూన్ 14 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు మేక‌ర్స్. అలాగే మూవీకి సంబంధించి ఒక పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో చైత‌న్య‌రావు, సూర్య క‌నిపిస్తోన్నారు. వారి వెనుక‌ షాడోలో మెడిక‌ల్ షాప్‌ను చూపించ‌డం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

డియర్ నాన్న సినిమా కథ విషయానికి వస్తే.. మెడికల్ షాప్ నడిపే తండ్రి (సూర్య) కొడుకుని కూడా తనలాగే ఫార్మసిస్ట్ చేయాలనుకుంటాడు. కానీ కొడుకు (చైతన్యరావు) మాత్రం చెఫ్ కావాలని కలలు కంటాడు. ఇలా భిన్న మనస్తత్వాల కారణంగా తండ్రికొడుకులు జీవితంలో ఎలాంటి మానసిక సంఘర్షణ ఎదుర్కొన్నారు. చివరకు ఏమైంది అన్నది తెలుసుకోవాలంటే డియర్ నాన్న సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. ఆదివారం (జూన్ 16) ఫాదర్స్ డే స్పెషల్ గా స్ట్రీమింగ్ కానున్న ఈ మూవీ ఫ్యామిలీ ఆడియెన్స్ కు మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

డియర్ నాన్న ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.