ఇటీవల బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా స్త్రీ 2. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ సృష్టించింది. విడుదలైన 39 రోజుల్లోనే ఈ సినిమా రూ.604.22 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టిన ఈ మూవీ రూ.713 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్ వసూళ్లు రాబట్టిన తొలి హిందీ సినిమాగా స్త్రీ 2 నిలిచింది. ఇదివరకే ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 2018లో వచ్చిన స్త్రీ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ఆగస్ట్ 15న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్, రాజ్ కుమార్ రావు కీలకపాత్రలు పోషించారు.
ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. చందేరీ గ్రామంలో స్త్రీ సమస్య తొలగిందని అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ అంతలోనే అదే గ్రామంలో సర్కటతో కొత్త సమస్య మొదలవుతుంది. గ్రామంలో మోడ్రన్ గా ఉండే అమ్మాయిలను ఇబ్బందులు పెడుతుంటాడు సర్కట. అలాగే కొందరు అమ్మాయి కనిపించకుండా పోతారు.
దీంతో సర్కట సమస్యను పరిష్కరించేందుకు విక్కీ (రాజ్ కుమార్ రావు), రుద్ర (పంకజ్ త్రిపాఠి), జన (అభిషేక్ బెనర్జీ), బిట్టు (అపర్ శక్తి)తోపాటు శ్రద్ధా కపూర్ స్త్రీ అనే దెయ్యం సాయం తీసుకుంటారు. అయితే ఊరు వదిలి వెళ్లిన స్త్రీ దెయ్యం తిరిగి వచ్చిందా.. ? విక్కీ, శ్రద్దాకు సాయం చేసిందా ? అనేది సినిమా. ఎలాంటి అంచనాలు.. భారీ తారాగణం లేకుండానే విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.