OTT Movie: ఓటీటీలో బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. ట్విస్టులకు దిమ్మ తిరిగిపోద్ది.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఇప్పుడు తమిళం, మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలను నేరుగా ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. అలా తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయిన ఓ హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగు వెర్షన్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.

OTT Movie: ఓటీటీలో బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. ట్విస్టులకు దిమ్మ తిరిగిపోద్ది.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie

Updated on: May 29, 2025 | 1:31 PM

ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టేందుకు మరో హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఇవ్వడమే కాకుండా బాగా భయ పెట్టింది. సైక‌లాజిక‌ల్ హార‌ర్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీ ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. ఇప్పుడీ సినిమా ఓటీటీ ఆడియెన్స్ ను భయపెట్టేందుకు వచ్చింది. సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో విఘ్నేష్ శివ‌న్ అనే ఓ సినిమా డైరెక్ట‌ర్‌ సినిమా ప్రయత్నాల్లో బిజీగా ఉంటాడు. తాను తీయ‌బోతున్న హార‌ర్ మూవీ కోసం క‌థ రాసే ప్రణాళికల్లో ఉంటాడు. ఎలాంటి అడ్డంకులు, డిస్ట్ర‌బెన్స్ లేకుండా సినిమాక‌థ రాసుకోవ‌డానికి సిటీ శివారులో ఉన్న ఓ బంగ‌ళాకు షిప్ట్ అవుతాడు. అయితే ఆ బిల్డింగ్‌లో నిద్ర‌పోయిన త‌ర్వాత విఘ్నేష్ శివ‌న్‌కు విచిత్ర‌మైన క‌ల‌లు వ‌స్తుంటాయి. ఓ ద‌య్యం అత‌నిని చంప‌డానికి చూస్తుంది. మరి ఆ బిల్డింగ్‌లో ద‌య్యం ఉందా? విఘ్నేష్ ను చంపేందుకు ప్రయత్నించింది ఎవరు? ఆ బిల్డింగ్ మిస్ట‌రీని విఘ్నేష్ శివ‌న్ ఎలా ఛేదించాడు? విఘ్నేష్ డైరెక్ట‌ర్ అయ్యాడా? లేదా? అన్న‌దే ఈ సినిమా కథ.

ఈ హారర థ్రిల్లర్ సినిమా పేరు డీమన్. స‌చిన్ మ‌ణి, అబ‌ర్న‌తి హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ హార‌ర్ మూవీలో సురుతి పేరియసామి, కుంకి అశ్విన్, రవీనా కీలక పాత్రలు పోషించారు. ర‌మేష్ ప‌ళ‌నీవేల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మూవీ ఆద్యంతం హార‌ర్ ఎలిమెంట్స్‌తో ఆడియెన్స్‌ను భ‌య‌పెట్టాడు డైరెక్ట‌ర్‌. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుందన్న కామెంట్స్ కూడా వినిపించాయి. 2023 సెప్టెంబ‌ర్‌లో త‌మిళంలో ఈ సినిమా రిలీజైంది. దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమ ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది. హారర్ థ్రిల్లర్ సినిమాలను చూడాలనకునేవారికి డీమన్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

ఇవి కూడా చదవండి..

OTT Movie: పౌర్ణమి రోజున రెచ్చిపోయే రక్త పిశాచి.. ఓటీటీలో ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్.. చిన్న పిల్లలు చూడొద్దు

Tollywood: 17 ఏళ్లకే సినిమాల్లోకి.. బిగ్ బాస్‌తో ఎనలేని క్రేజ్.. ఈ విజయవాడ బ్యూటీని గుర్తు పట్టారా?

Tollywood: ఏంటమ్మా ఇది! వోడ్కాకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నెటిజన్ల ఆగ్రహం

Hari Hara Veera Mallu: పవన్ హరి హర వీరమల్లులో మెరిసిన టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్.. ఎవరో గుర్తు పట్టారా?

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.