Bigg Boss Telugu OTT Logo: బుల్లితెరపై బిగ్‌బాస్ (Bigg Boss ) రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ షోకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ బిగ్ బాస్ షో ఇప్పటికే హిందీలో పదిహేను సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. అంతేకాకుండా తెలుగు, తమిళ్, మలయాళంలోనూ బిగ్‌బాస్ రియాల్టీకు మంచి రెస్పాన్స్ వస్తుంది. తెలుగులో అయితే.. బిగ్ బాస్ సీజన్ 5 ఇటీవలే ఘనంగా ముగిసింది. ఈ ఐదవ సీజన్ లో టైటిల్ విన్నర్‌గా వీజే సన్ని నిలవగా.. యూట్యూబర్ షణ్ముఖ్ రెండవ స్థానం దక్కించుకున్నాడు. కాగా.. ఈ సీజన్ ఫినాలే ఈవెంట్‌లో హోస్ట్ నాగార్జున మరో రెండు నెలల్లో సరికొత్త బిగ్ బాస్ సీజన్ ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సారి బిగ్‌బాస్ ఓటీటీ మొదలు కానుందని నిర్వాహకులు ప్రకటించారు. ఇకపై ఈ షోను 24 గంటలపాటు వీక్షించవచ్చని నిర్వాహకులు వెల్లడించారు. అయితే.. తాజాగా బిగ్ బాస్ నుంచి మరో అప్డేట్ వచ్చింది. తెలుగు బిగ్ బాస్ షోకు సంబంధించిన తెలుగు ఓటీటీ లోగో (Bigg Boss OTT) ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విడుదల చేసింది.
బిగ్ బాస్ ఇకపై డిస్నీ+హాట్‌స్టార్‌లో నాన్‌స్టాప్‌గా ప్రసారం కానున్నట్లు నిర్వాహకులు ప్రకటనను విడుదల చేశారు. నాన్‌స్టాప్‌గా 24 గంటల వినోదాన్ని నేరుగా బిగ్‌బాస్ హౌస్ నుంచి అందిస్తామని తెలిపారు. ఈ వినోద అద్భుతం త్వరలోనే అరచేతుల్లోకి (మొబైల్) రాబోతుందని ప్రకటనలో తెలిపారు. అత్యంత ఆసక్తి కలిగించే హౌస్‌మేట్స్ కలిగిన బిగ్‌బాస్ హౌస్ ఈ సారి మీ చూపు తిప్పుకోనీయదని పేర్కొన్నారు. తెలుగు టీవీ అభిమానులు ఇప్పుడు వినోదాన్ని మరో స్థాయిలో ఆస్వాదించే రీతిలో బిగ్‌బాస్ రూపుదిద్దుకుంటుందని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ పేర్కొంది. ఈ మేరకు బిగ్‌బాస్ లోగోను డిస్నీ+హాట్‌స్టార్ తెలుగు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా విడుదల చేసింది.
కాగా.. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బిగ్‌బాస్ ఓటీటీ గురించి అనేక రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ లీస్ట్ ఫైనల్ అయ్యిందని.. ఇందులో మాజీ కంటెస్టెంట్స్ తోపాటు.. కొత్తవారు కూడా పాల్గొనబోతున్నారంటూ టాక్ నడుస్తోంది. దీని గురించి క్లారిటీ రావాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read: