AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: లవ్ స్టోరీకి లైన్ క్లియర్.. విష్ణు నచ్చేసిందన్న పృథ్వీ తల్లి.. మోసం చేయకు అంటూ..

బిగ్‌బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. ఈ వీక్ ప్రారంభం నుంచి తన తల్లిని పంపించాలంటూ ఏడుస్తున్నాడు తేజ. ఇక నిన్నటి ఎపిసోడ్ లో పృథ్వీ తల్లి అడుగుపెట్టింది. హౌస్ లోకి రాగానే విష్ణు బాగానే కాకాపట్టింది. మాటి మాటికీ కాళ్లు పట్టుకుంటూ థాంక్స్ చెప్పింది. నువ్వు నా కూతురు లాగా అంటూ షాకిచ్చింది.

Bigg Boss 8 Telugu: లవ్ స్టోరీకి లైన్ క్లియర్.. విష్ణు నచ్చేసిందన్న పృథ్వీ తల్లి.. మోసం చేయకు అంటూ..
Bigg Boss 8 Telugu
Rajitha Chanti
|

Updated on: Nov 15, 2024 | 7:25 AM

Share

బిగ్‌బాస్ సీజన్ 8లో ఫ్యామిలీ వీక్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యష్మీ, నిఖిల్, అవినాష్ హౌస్మేట్స్ రాగా.. ప్రేరణ, టేస్టీ తేజ, పృథ్వీ ఫ్యామిలీ హౌస్ లోకి రానున్నారు. నిన్నటి ఎపిసోడ్‏లో ఏం జరిగిందో చూద్దాం. బిగ్‌బాస్ హౌస్ లో కేజీఎఫ్ సినిమాలోని తల్లి సాంగ్ వేశారు. దీంతో తేజ ఆశగా గేట్ వైపు చూడగా.. పృథ్వీ తల్లి హౌస్ లోకి వచ్చారు. రావడంతోనే పృథ్వీని హత్తుకుని ఐ లవ్యూ చెప్పారు. ఆ తర్వాత తేజ దగ్గరకు వెళ్లి బాధపడకు .. అమ్మ వస్తారు.. ఐ లవ్యూ అంటూ చెప్పారు. ఇక పృథ్వీ తల్లి కాళ్లమీద పడి థాంక్యూ పృథ్వీని కన్నందుకు అంటూ డైలాగ్ కొట్టింది విష్ణు. ఇక మరోసారి తేజ పక్కన కూర్చొని బాధపడ్డారు. అందరి పేరెంట్స్ వస్తున్నారు కదా బిగ్‌బాస్.. మా అమ్మకూడా పంపించండి. ఇంత బాధ నేను భరించలేను.. ఏం కావాలన్నా చేస్తాను.. మా అమ్మను మాత్రం పంపించండి. ప్లీజ్ ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు. చాలా కష్టపడి ఇక్కడి వరకు వచ్చాను అంటూ వేడుకున్నాడు తేజ.

ఇక పృథ్వీ తల్లి దగ్గరకు వెళ్లి కన్నడలో మాట్లాడాడు నిఖిల్. అమ్మాయి బాగుందా.. ఓకేనా లేక మంగళూరులో చూద్దామా పిల్లని అంటూ ఆటపట్టించాడు. అమ్మాయి బాగుంది. పెళ్లి చేసుకుని వస్తాడేమో వీడు అంటూ ట్రోఫీ తీసుకుని రా అమ్మాయిని కాదు అంటూ కౌంటరిచ్చింది పృథ్వీ తల్లి. ఆ తర్వాత కొడుకుతో ఒంటరిగా కూర్చొని సలహాలు, సూచనలు ఇస్తుంది. “అందరితో ఉండు.. ఎవరితోనూ గొడవపడకు.. నువ్వు మెగా చీఫ్ అవ్వాలంటే అదే దారి.. ఎవరితోనూ విభేదించకు సొంతగా నిర్ణయం తీసుకో.. మెగా చీఫ్ అవ్వాలంటే అదే దారి.. కప్పు తీసుకొని రా.. తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పు” అని అన్నారు.

తమ్ముడు ఏం చెప్పలేదా అని పృథ్వీ అడగ్గా.. ‘ప్రేక్షకులకు ఎందుకు థాంక్స్ చెప్పవు.. చెప్పు..’ అని అన్నారు. నీకు ఎవరి ఇష్టం అని అడగ్గా.. నువ్వే అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నేను కాకుండా ఎవరు అడగ్గా.. ‘విష్ణుప్రియ, జెన్యూన్ గా ఉంటుంది. డాన్స్ బాగా చేస్తుంది. దైవభక్తి ఎక్కువ.. నాకు దైవ భక్తి ఎక్కువ అందుకే నాకు బాగా నచ్చింది.. గేమ్ లో ఫేక్ చేయకు.. నువ్వు ఎలా ఆడావో అలాగే ఆడు.. గెలవకపోయిన పర్లేదు.. మోసం చేయకు’ అంటూ సలహాలు ఇచ్చారు. ఆ తర్వాత వెళ్లేముందు ఒక గేమ్ ఆడాలి అంటూ బిగ్ బాస్ చెప్పాగా.. అందులో గెలిచి అమ్మ చేతి వంటను సాధించారు. ఇక పృథ్వీ తల్లి వెళ్లేముందు నన్ను లవ్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ మళ్లీ కాళ్లు మొక్కింది విష్ణు. నువ్వు నా కూతురులాగ అంటూ పృథ్వీ తల్లి షాకిచ్చింది. దీంతో నో నో అంటూ ఫేస్ మార్చేసింది.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మిథున రాశిలో రవి.. వారికి ప్రతి ప్రయత్నంలో విజయం..!
మిథున రాశిలో రవి.. వారికి ప్రతి ప్రయత్నంలో విజయం..!
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?