ఓటీటీలోకి మరో థ్రిల్లర్ మూవీ రానుంది. ఈ మధ్య తెలుగులో బాగా బజ్ క్రియేట్ చేసిన భూతద్దం భాస్కర్ నారాయణ థియేటర్లలో విడుడలైన నాలుగు వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ఫ్యాంటసీ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ హీరో శివ కందూకూరి ప్రధాన పాత్ర పోషించాడు. రాశి సింగ్, దేవీ ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్ తదితరులు ఇతర పాత్రల్లో మెరిశారు. పురుషోత్తం రాజ్ తెరకెక్కించిన ఈ సినిమాపై రిలీజ్ కు ముందే బాగా బజ్ క్రియేట్ అయ్యింది. ప్రమోషన్లు కూడా విస్తృతంగా నిర్వహించారు. టీజర్స్, టైలర్లు కూడా సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. అందుకు తగ్గట్టే మార్చి 1న విడుదలైన భూతద్దం భాస్కర్ నారాయణకు పాజిటివ్ టాక్ వచ్చింది. కథా, కథనాలు ఆసక్తికరంగా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లనే రాబట్టింది. ఇలా థియేటర్లలో ఆడియెన్స్ మెప్పు పొందిన భూతద్దం భాస్కర్ నారాయణ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 22వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. తాజాగా ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా షేర్ చేసుకుంది ఆహా ఓటీటీ. ‘బొమ్మ కనిపించే ప్రతీసారీ దిమ్మతిరిగే ట్విస్టు ఉంటది! అదెంటో తెలుసుకోవాలని ఉందా?’ అంటూ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.
భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాలో శివకుమార్, షఫీ, సురభి సంతోష్, శివన్నారాయణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. స్నేహల్ జంగల, శశిధర్ కాశీ, కార్తిక్ ముడుంబి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్, శ్రీచరణ్ పాకాల స్వరాలు సమకూర్చారు. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా, గౌతమ్ జీ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో జరిగే వరుస హత్యల వెనక ఉన్న మిస్టరీని ఛేదించడం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.
బొమ్మ కనిపించే ప్రతీసారీ దిమ్మతిరిగే ట్విస్టు ఉంటది!
అదెంటో తెలుసుకోవాలని ఉందా?#BhoothaddamBhaskarNarayana Premieres March 22 ✌🏻@iam_shiva9696 @RaajPurushotham @RashiReal_ @adityamusic pic.twitter.com/bbHmAtMx51— ahavideoin (@ahavideoIN) March 16, 2024
బొమ్మ కనిపించే ప్రతీసారీ దిమ్మతిరిగే ట్విస్టు ఉంటది! అదెంటో తెలుసుకోవాలని ఉందా? #BhoothaddamBhaskarNarayana Premieres March 22 ✌🏻@ahavideoIN @iam_shiva9696 @RaajPurushotham @RashiReal_ @adityamusic pic.twitter.com/0ibOQDuGi7
— Suresh Kondeti (@santoshamsuresh) March 16, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.