OTT Movie: పోలీసులపై పగ.. హింట్ ఇచ్చి మరీ హత్యలు చేసే సైకో కిల్లర్.. ఓటీటీలో 41 అవార్డులు గెల్చుకున్న సినిమా

సస్పెన్స్ తో కూడిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే ఆదరణే వేరు. ముఖ్యంగా ఇప్పుడు ఓటీటీలో ఈ జానర్ సినిమాలదే హవా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు చెందినదే. ఈ మూవీకి ఏకంగా 41 అవార్డులు రావడం విశేషం.

OTT Movie: పోలీసులపై పగ.. హింట్ ఇచ్చి మరీ హత్యలు చేసే సైకో కిల్లర్.. ఓటీటీలో 41 అవార్డులు గెల్చుకున్న సినిమా
OTT Movie

Updated on: Sep 08, 2025 | 10:06 PM

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎంతో ఆసక్తిగా సాగుతాయి. సినిమా ముందుకు సాగే కొద్దీ అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఎవడు వీటిని చేస్తున్నాడు? అతని ఉద్దేశమేంటి? అని తెలుసుకోవవడానికి ఆడియెన్స్ బాగా ఆత్రుత చూపిస్తారు. ముఖ్యంగా ఇలాంటి సినిమాల్లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే ట్విస్టులు కూడా ఉంటే ఇక ఆడియెన్స్ కు పండగే. ఇలా ఒక సినిమా లవర్ కు కావాల్సిన అన్నీ అంశాలు ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఉన్నాయి. విశేషమేమిటంటే ఈ సినిమా ఏకంగా 41 అవార్డులు గెల్చుకుని రికార్డ్ సృష్టించింది. ఇందులో ఇంటర్నేషనల్ అవార్డులు కూడా ఉన్నాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కోల్ కతా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నగరంలో వరుస హత్యలు కలకలం రేపుతాయి. హంతకుడు ప్రతి హత్య దగ్గర కొన్ని కవిత్వాలు వదిలేస్తుంటాడు. దీంతో ఈ సీరియల్ కిల్లింగ్స్ మిస్టరీని ఛేదించేందుకు అభిజిత్ పక్రాశి అనే పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. కానీ అతనికి కేసుకు సంబంధించి ఎలాంటి లీడ్ దొరకదు. దీంతో మాజీ పోలీసు అధికారి ప్రొబీర్ రాయ్ చౌధురీ హెల్ప్ తీసుకుంటాడు.

ప్రొబీర్ గతంలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్. నేరస్తులను ఎంతో క్రూరంగా ఎన్ కౌంటర్ చేసి ఉంటాడు. అభిజిత్, ప్రొబీర్ కలిసి సీరియల్ కిల్లింగ్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. విచారణలో వారికి సంచలన విషయాలు తెలుస్తాయి. మరి ఈ సీరియల్ కిల్లింగ్స్ వెనక మర్మమేమిటి? ఆ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకీ హత్యలు చేశాడు? పోలీసులకు ఎలా దొరికాడు? చివరకు ఏమైంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే.

ఈ బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు బైశే శ్రాబోన్. సృజిత్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన  ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో బాలీవుగడ్ నటి రైమా సేన్  ప్రధాన పాత్ర పోషించింది. అలాగే అబిర్ చటర్జీ, ప్రొసెన్‌జిత్ చటర్జీ, పరమ్‌బ్రత చటర్జీ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ప్రస్తుతం ఈ సినిమా మూడు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు జియో హాట్ స్టార్, హోయ్‌చోయ్ లలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ లేదు కానీ ఇంగ్లిష్ లో సబ్ టైటిల్స్ ఉన్నాయి. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారికి బైశే శ్రాబోన్ ఒక మంచి మూవీ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి