తెలుగు సినిమాలు ప్రస్తుతం ప్రపంచ మొత్తం క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. దాంతో ఇతర బాషా దర్శకులు, హీరోలు మనవారితో కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే తమిళ్ హీరోలు ధనుష్, శివకార్తికేయన్ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ఇలా పలువురు మన దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. అలాగే మన హీరోలు కూడా ఇతర బాషా దర్శకులతో పని చేస్తున్నారు. ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ లో వార్ సీక్వెల్ చేస్తున్నాడు. అంతకు ముందు కింగ్ నాగార్జున రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర మూవీలో కీలక పాత్రలో కనిపించారు. ఇదిలా ఉంటే మన హీరో బాలీవుడ్ లో సినిమా చేసి బోల్తా కొట్టాడు.. ఆయన ఎవరో కాదు బెల్లంకొండ శ్రీనివాస్. అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా పరిచయం అయిన ఈ హీరో ఆతర్వాత వరుసగా సినిమాలు చేశాడు.
వాటిలో బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన జయజనకి నాయక సినిమా పర్లేదు అనిపించుకుంది. ఆతర్వాత అల్లుడు అదుర్స్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో బాలీవుడ్ బాట పట్టాడు. హిందీలో మన తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి సినిమాను రీమేక్ చేశాడు. తెలుగు దర్శకుడు వీవీ వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అక్కడ డిజాస్టర్ అయ్యింది. అప్పటికే రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి సినిమా యూట్యూబ్ లో హిందీలో డబ్ అయ్యింది. అందరు ఆ సినిమాను చూశారు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో హిందీ ఛత్రపతి డిజాస్టర్ గా మిగిలింది. సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతున్న ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఎలాంటి వార్తలు రాలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా చడీ చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది థియేటర్స్ లోనే కష్టంగా చూసిన ఈ సినిమాను ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేస్తుంది. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
Iss Independence Day, ho jao taiyaar for an action-packed entertainer!Dekhiye #TVParPehliBaar #39,Chatrapathi ,Tues, 15th August, raat 8 baje, sirf #ZeeCinema par@zeecinema @Nushrratt @SharadK7 @karan_chhabra @bhagyashree123 @Freddydaruwala#VVVinayak @jayantilalgada @PenMovies pic.twitter.com/tHgmaJvnM3
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) August 14, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.