Unstoppable Season 4: దుల్కర్ సల్మాన్‏ను ఆటపట్టించిన బాలయ్య.. లక్కీ భాస్కర్ టీమ్‏తో నవ్వులే నవ్వులు..

|

Oct 29, 2024 | 7:18 PM

ప్రస్తుతం ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న షో అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఇప్పటికే మూడు సీజన్స్ విజయవంతంగా కంప్లీట్ కాగా.. ఇప్పుడు సీజన్ 4 స్టార్ట్ అయ్యింది. మొదటి ఎపిసోడ్ కు ఏపీ సీఎం చంద్రబాబు అతిథిగా రాగా..ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ కు మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ వచ్చారు.

Unstoppable Season 4: దుల్కర్ సల్మాన్‏ను ఆటపట్టించిన బాలయ్య.. లక్కీ భాస్కర్ టీమ్‏తో నవ్వులే నవ్వులు..
Unstoppable Season 4
Follow us on

నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తోన్న అన్‎స్టాపబుల్ సీజన్ 4 టాక్ షో ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షో మొదటి ఎపిసోడ్‏కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అతిథిగా విచ్చేసి తన రాజకీయ, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. గత సీజన్స్ మాదిరిగానే ఈసారి కూడా ఈ షోకు రాబోయే అతిథుల పై క్యూరియాసిటి నెలకొంది. ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత రెండో ఎపిసోడ్ కు ఎవరు గెస్ట్ గా రాబోతున్నారు అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే రెండో ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసింది ఆహా. ఇక ఎవరూ ఊహించని విధంగా ఈసారి బాలయ్య అన్ స్టాపబుల్ షోలో మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సందడి చేశారు. లక్కీ భాస్కర్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా చిత్రయూనిట్ మొత్తం బాలయ్యతో కలిసి సందడి చేశారు. హీరో దుల్కర్ సల్మాన్ తోపాటు హీరోయిన్ మీనాక్షి చౌదరి, దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీలు సందడి చేశారు.

తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ప్రారంభంలోనే బాలయ్య పోలీస్ ఆఫీసర్ గెటల్ లో ఎంట్రీ ఇచ్చి మరోసారి డైలాగ్స్ అదరగొట్టేశారు. గడ్డు కాలం ఎదురొచ్చినా.. చెడ్డవాడు ఎగేసుకొచ్చినా.. ధైర్యంగా నిలబడాలి… ధైర్యంగా కలపడాలి.. అలుపెరగక సాగిపోవాలి. అన్ స్టాపబుల్ గా నిలిచిపోవాలి అనే డైలాగ్ ను తనస్టైల్లో చెప్పి అలరించారు. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ ను స్టేజ్ పైకి పిలిచి.. ఏంటీ ఈ గ్లామర్ నన్ను నేను చూసుకుంటున్నట్లు ఉంది అంటూ నవ్వులు పూయించారు.

ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ తో ఓ గేమ్ ఆడించి.. ఒక్కో బెలూన్ పగలగొడుతున్నప్పుడు హీరోయిన్స్ పేర్లు చెబుతూ నవ్వులు పూయించారు బాలయ్య. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ ఫాదర్.. మమ్ముట్టితో వీడియో కాల్ మాట్లాడారు. ఆ తర్వాత డైరెక్టర్ వెంకీ అట్లూరి వచ్చినప్పుడు దుల్కర్ సల్మాన్ ఫోన్ చూస్తూ కూర్చున్నారు. దీంతో నా దగ్గరకు వచ్చి ఫోన్ లో చాటింగ్ లు అంటూ టీజ్ చేశారు. దీంతో దుల్కర్ సల్మాన్ షాకయ్యారు. ఆ తర్వాత నిర్మాత నాగవంశీ, హీరోయిన్ మీనాక్షి చౌదరితోని పిలిచి ఫన్నీగా ముచ్చటించారు. తాజాగా విడుదలైన ప్రోమో ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది.

ఇది చదవండి : Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..

Arjun Reddy: తస్సాదియ్యా.. ఏం మేకోవర్ భయ్యా.. ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీని ఇప్పుడు చూస్తే ప్రేమలో పడాల్సిందే..

Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్‍ లుక్‏లో తారక్.. వేరేలెవల్ అంతే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.