తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించి ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది అవంతకి వందనపు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ మూవీతో తెలుగు తెరకు బాలనటిగా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో కనిపించింది. అలాగే కమర్షియల్ యాడ్స్ చేసి తెలుగు ప్రజలకు దగ్గరయ్యింది. ఆ తర్వాత ఆకస్మాత్తుగా ఇండస్ట్రీకి దూరమైంది అవంతిక. ఇటీవలే ఆమె హాలీవుడ్ లో మీన్ గర్ల్స్ (Mean Girls) మూవీలో నటించింది. ఈ ఏడాది జనవరి 12న అమెరికా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో తెలుగమ్మాయి అవంతిక నటనకు అక్కడి అడియన్స్ ఫిదా అయ్యారు. ఆమె నటనపై హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు కురిపించారు. మీన్ గర్ల్స్ చిత్రంలో హాలీవుడ్ ప్రముఖ నటీనటులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని అదుర్స్ అనిపించింది. ఇక ఈమూవీలో అవంతిక చేసిన సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఈ సినిమాతో అవంతిక పేరు మారుమోగింది. ఈ సూపర్ హిట్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిసింది.
అవంతిక వందనపు నటించిన “మీన్ గర్ల్స్ ది మ్యూజికల్” మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటుంది. అయితే ఈ సినిమాను ఇండియన్ అడియన్స్ చూడలేరు. ఎందుకంటే ఈ చిత్రం కేవలం అమెరికాలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలోనే ఇండియన్ ప్రేక్షకులకు అందుబాటులోకి రావొచ్చు.
ఈ చిత్రంలో రెనీ రాప్, అవంతిక వందనపు, అంగోరీ రైస్ ప్రధాన పాత్రలు పోషించారు. అవంతిక.. తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి. 2005లో కాలిఫోర్నియాలో జన్మించింది. అక్కడే చదువుతోపాటు యాక్టింగ్ లోనూ ట్రైనింగ్ తీసుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన బ్రహ్మాస్త్రం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. హాలీవుడ్ ఇండస్ట్రీలో డైరీ ఆఫ్ ఫ్యూచర్ ప్రెసిడెంట్, స్పిన్, సీనియర్ ఇయర్ చిత్రాల్లో నటించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.