Ardhashathabdam Movie Review: ‘ఆహా’లో విడుద‌లైన అర్ధశతాబ్దం.. ఎలా ఉందంటే..?

|

Jun 12, 2021 | 5:58 PM

స్టార్ కాస్టింగ్ ఉంటేనే సినిమా సక్సెస్ అవుతుందని, రెగ్యులర్ కమర్షియల్ వ్యాల్యూస్ లేకపోతే ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయలేమని.. వెనక్కు తగ్గే రోజులు కావిప్పుడు...

Ardhashathabdam Movie Review: ఆహాలో విడుద‌లైన అర్ధశతాబ్దం.. ఎలా ఉందంటే..?
Ardhashathabdam Telugu Movie
Follow us on

స్టార్ కాస్టింగ్ ఉంటేనే సినిమా సక్సెస్ అవుతుందని, రెగ్యులర్ కమర్షియల్ వ్యాల్యూస్ లేకపోతే ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయలేమని.. వెనక్కు తగ్గే రోజులు కావిప్పుడు. కేవలం కథాబలాన్నే నమ్ముకుని తీసే నవయువ ద‌ర్శ‌కుల‌కు కూడా రెడ్ కార్పెట్ పరవడాన్ని అలవాటుగా మాచుకున్నాడు సగటు ప్రేక్షకుడు. ఆహాలో రిలీజైన లేటెస్ట్ మూవీ అర్ధశతాబ్దం రిజల్ట్ కూడా అదే చెబుతోంది. పర్ఫెక్ట్ రూరల్ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కిన ఇంటెన్స్ లవ్ స్టోరీ అర్ధ శతాబ్దం. ఇటీవ‌ల‌ ఆహాలో రిలీజైన ఈ మూవీకి మంచి అప్లాజ్ వస్తోంది. ఇద్దరు ప్రేమికుల మధ్య కులం అడ్డుగోడల నేపథ్యంతో గతంలో చాలా ప్రేమకథలు వచ్చినా.. దీనికి డైరెక్టర్ రవీంద్ర పుల్లే ఇచ్చిన ట్రీట్మెంట్ కొత్తగా ఉందన్నది ఫస్ట్ రివ్యూ.

చూడగానే మనూరోడే.. మన పక్కింటోడే అనే ఫీల్ కలిగించే కార్తీక్ రత్నం అర్ధ శతాబ్దం మూవీకి స్పెషల్ ఎసెట్. కేరాఫ్ కంచరపాలెంతోనే టాలెంట్ ప్రూవ్ చేసుకున్న కార్తీక్.. అర్ధ శతాబ్దంలో క్రిష్ణ అనే ఆవేశపరుడైన యువకుడి పాత్రతో మరింత న్యాచురల్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ప్రేమ-పగ.. రెండు వేరియేషన్స్ నీ బాగా బ్యాలెన్స్ చేశాడన్న కాంప్లిమెంట్స్ వస్తున్నాయి కార్తీక్ కి. తెలంగాణ రూరల్ పాకెట్స్ లో ఇప్పటికీ వేళ్లూనుకున్న కుల వ్యవస్థని, దాన్ని అడ్డుపెట్టుకుని జరిగే అరాచకాల్ని కళ్ళకు కట్టినట్టు చూపారు. సాయికుమార్, శుభలేఖ సుధాకర్ పాత్రలు సినిమాను మరింత హుందాగా నడిపాయి. సిద్ శ్రీరామ్, అనురాగ్ కులకర్ణి, శంకర్ మహదేవన్ పాడిన పాటలు అర్ధశతాబ్ధానికి వెయిట్ ని పెంచేశాయి.

హీరోయిన్ గా కృష్ణప్రియ, మరో కీలక పాత్రలో నవీన్ చంద్ర నటించారు. ఇప్పటికే కలర్‌ఫోటో, సూపర్ ఓవర్‌, భానుమతి రామకృష్ణ లాంటి బ్యూటిఫుల్ మూవీస్ వున్న ‘ఆహా’ ఫిలిం లైబ్రరీలో అర్ధ శతాబ్దం లేటెస్ట్ అడిషన్.

Also Read:  ‘క‌రోనా మాతా.. కాపాడ‌మ్మా, శాంతించ‌మ్మా’.. మ‌హమ్మారికి గుడిక‌ట్టి పూజ‌లు చేస్తున్న గ్రామ‌స్తులు

ఇన్ని పండ్లు ఒకే చోట‌.. పండుగే పండుగ.. ఏనుగు ఎంజాయ్ చేస్తూ ఎలా తినిందో చూడండి