Unstoppable with NBK: అన్‏స్టాపబుల్ షోలో ‘యానిమల్’ టీమ్.. బాలయ్యతో రణబీర్, రష్మిక.. ఫోటోస్ వైరల్..

|

Nov 14, 2023 | 7:51 PM

పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను విడుదల చేస్తుండడంతో మూవీ ప్రమోషన్స్ సైతం అదే స్తాయిలో నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ముఖ్యంగా సౌత్ పై యానిమల్ టీం కాస్త ఎక్కువగానే ఫోకస్ పెట్టింది. ముంబై టూ హైదరాబాద్ యానిమల్ టీం ప్రమోషన్స్ షూరు చేసింది. ఇందులో భాగంగా ఈరోజు రణబీర్ కపూర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఇదివరకే బ్రహ్మాస్త్ర సినిమాతో తెలుగు అడియన్స్ కు దగ్గరయ్యాడు రణబీర్ కపూర్. ఇప్పుడు మరోసారి యానిమల్ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యాడు.

Unstoppable with NBK: అన్‏స్టాపబుల్ షోలో యానిమల్ టీమ్.. బాలయ్యతో రణబీర్, రష్మిక.. ఫోటోస్ వైరల్..
Animal Team With Nbk
Follow us on

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న చిత్రం ‘యానిమల్’. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై నార్త్, సౌత్ ఇండస్ట్రీలో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అలాగే ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్, టీజర్, పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. అలాగే బుధవారం విడుదలైన నాన్న నువ్ నా ప్రాణం సాంగ్ ఆకట్టుకుంది. తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని ఈ పాట రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను విడుదల చేస్తుండడంతో మూవీ ప్రమోషన్స్ సైతం అదే స్తాయిలో నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ముఖ్యంగా సౌత్ పై యానిమల్ టీం కాస్త ఎక్కువగానే ఫోకస్ పెట్టింది. ముంబై టూ హైదరాబాద్ యానిమల్ టీం ప్రమోషన్స్ షూరు చేసింది. ఇందులో భాగంగా ఈరోజు రణబీర్ కపూర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఇదివరకే బ్రహ్మాస్త్ర సినిమాతో తెలుగు అడియన్స్ కు దగ్గరయ్యాడు రణబీర్ కపూర్. ఇప్పుడు మరోసారి యానిమల్ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యాడు.

ఇదిలా ఉంటే.. యానిమల్ సినిమా ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న రణబీర్.. నందమూరి నటసింహం బాలకృష్ణను కలుసుకున్నారు. ప్రస్తుతం బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తోన్న టాక్ షో అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకేలో పాల్గొన్నారు. రణబీర్ కపూర్‏తో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ షోలో సందడి చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇప్పటివరకు యానిమల్ చిత్రంలో ఎంతో భీకరంగా కనిపించిన రణబీర్ బాలయ్య షోలో మాత్రం మళ్లీ క్యూట్ అండ్ స్టైలీష్ గా కనిపిస్తున్నారు. ఇప్పటికే వీరి ఎపిసోడ్ షూట్ జరిగినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

అయితే మొదటిసారి తెలుగు టాక్ షోలో పాల్గొన్న రణబీర్ ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడిగారు ?.. రణబీర్ చెప్పిన ఆన్సర్స్ ఏంటీ ?.. అలాగే తన ఫేవరేట్ క్రష్ రష్మిక బాలయ్య షోలో ఎలా సందడి చేసింది అనేది తెలుసుకునేందుకు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అలాగే ఇప్పటికే అన్ని పనులు కంప్లీట్ చేసుకున్న యానిమల్ సినిమా డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.