
ఓటీటీల్లో కొన్ని జానర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. మరీ ముఖ్యంగా హార్రర్, థ్రిల్లర్, క్రైమ్, సస్పెన్స్ జానర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ జానర్ సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో మాత్రం ఓ రేంజ్ లో హిట్ అవుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇదొక తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా థియేటర్లలో రిలీజైనప్పుడు పెద్దగ ఆడలేదు. స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం, పెద్దగా ప్రమోషన్లు లేకపోవడం, దీనికి తోడు ఇదే మూవీ రిలీజ్ సమయంలో మరికొన్ని సినిమాలు రిలీజ్ కావడంతో ఈ మూవీ థియేటర్లలో జస్ట్ యావరేజ్ గా నిలిచింది. అయితే కంటెంట్ పరంగా ఈ సినిమాకు మంచి పేరొచ్చింది. ఆకట్టుకునే కథా కథనాలు, ఉత్కంఠ సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, అద్దిరిపోయే ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి.
ఈ సినిమా కథ విషయానికి వస్తే..విక్రమ్ అనే యువకుడు అను అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ఊరిలో కొన్ని వింత సంఘటనలు జరుగుతాయి. కాలిపోయి పాడుబడిన ఆస్పత్రిలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఈ సీరియల్ మర్డర్స్ వెనక మిస్టరీ తెలుసుకోవాలని విక్రమ్ ఆసక్తి చూపిస్తాడు. అదే సమయంలో ఓ డిటెక్టివ్ కూడా ఈ మిస్టరీ మర్డర్స్ ను విచారిస్తుంటాడు.
ఇద్దరు కలిసి ఆ పాడుబడిన ఆస్పత్రి గతం గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటారు. ఆ ఊరిలో జరిగిన కొన్ని పాత సంఘటనలకు ఈ మర్డర్స్ కు లింక్ ఉందని కనిపెడతారు. మరి ఆ వరుస హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? హీరో ఈ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే.
ఆద్యంతం ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో సాగే ఈ సినిమా పేరు అన్వేషి. ఈ మూవీ పాతదే అయినా మంచి హారర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూడాలనుకునేవారికి ఒక మంచి ఛాయిస్. వి.జే. ఖన్నా తెరకెక్కించిన ఈ మూవీలో తెలుగమ్మాయి అన్వేషి ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. విజయ్ ధరణ్, సింమ్రాన్ గుప్తా, ప్రకాష్ జావేద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అ వుతోంది.
The spine chilling and edge of your seat moments of #Anveshi are now available for streaming on Amazon Prime ❤️💥@VijayDharan_D @SimranG18401460 @AnanyaNagalla @v_j_khanna @chaitanmusic @simonkking @GanapathiReddy_ @Ananthkancherla @durgesh_vt @MediaYouwe @WallsAndTrends… pic.twitter.com/I0GUJqd1j6
— YouWe Media (@MediaYouwe) March 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.