
ఇప్పుడు ఓటీటీలో క్రైమ్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస లదే హవా. భాషతో సంబంధం లేకుండా ఏ లాంగ్వేజ్ లో వచ్చినా ఈ జానర్ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా ఓటీటీ ఆడియెన్స్ అయితే ఎగబడి ఈ సినిమాలను చూస్తున్నారు. అలా ఈ హారర్ మూవీ లవర్స్ కోసం సోమవారమే (అక్టోబర్ 27) ఒక హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చింది. గతంలో వచ్చిన ఓ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ కు ఇది సీక్వెల్. ఓటీటీ ఆడియెన్స్ ఎప్పటి నుంచో ఈ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సోమవారం వీరి నిరీక్షణకు తెరపడింది. అమెరికన్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీ సిరీస్ లలో ‘ఇట్’ ఒకటి. ఈ సిరీస్ లో ఫస్ట్ మూవీ ‘ఇట్’ 2017లో రిలీజై సంచలన విజయం సాధించింది. దీనికి సీక్వెల్ గా 2019లో ‘ఇట్ చాప్టర్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడీ సిరీస్ లో మూడో భాగం ‘ఇట్:వెల్కమ్ టు డెర్రీ సిరీస్’ వచ్చేసింది. ఈ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్లున్నాయి. సోమవారం జియోహాట్‌స్టార్‌లో ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇక ఈ సిరీస్ లో రెండో ఎపిసోడ్ అక్టోబర్ 31న స్ట్రీమింగ్ కానుంది. మూడో ఎపిసోడ్ నవంబర్ 9న, నాలుగో ఎపిసోడ్ నవంబర్ 16న, అయిదో ఎపిసోడ్ నవంబర్ 23న, ఆరో ఎపిసోడ్ నవంబర్ 30న, ఏడో ఎపిసోడ్ డిసెంబర్ 7న, ఎనిమిదో ఎపిసోడ్ డిసెంబర్ 14న ఓటీటీలోకి రానున్నాయి.
స్టీఫెన్ కింగ్ 1986లో రాసిన నవల ‘ఇట్’ ఆధారంగా ఇట్ సినిమాలు, సిరీస్ రూపొందుతున్నాయి. ఆండీ ముషీటి, బర్బరా ముషీటి, జేసన్ ఈ సిరీస్ లను తెరకెక్కిస్తున్నారు. టేలర్, జోవన్, బ్లేక్ కామెరాన్, క్రిస్, జేమ్స్, స్టీఫెన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మంచి హారర్ థ్రిల్లర్ సిరీస్ చూడాలనుకునేవారికి ఇట్ వెల్కమ్ టు డెర్రీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. అయితే ఇందులో చాలా డిస్టర్బింగ్ సీన్స్ ఉన్నాయి. కాబట్ట పిల్లలతో చూడకపోవడమే ఉత్తమం..
Episode 1 of IT: Welcome to Derry is now streaming on Disney+ Hotstar!#ITWelcomeToDerry #Pennywise #BillSkarsgard #HBOMax #HorrorSeries #ITPrequel #hotstar #DisneyPlusHotstar #tvseries #tvshows #ott #ottinformer pic.twitter.com/rLRcpCQYRK
— OTT Informer (@OTTInformer) October 27, 2025
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి