Bheemla Nayak: థియేటర్‌లో విడుదలైన నెల రోజులకు ఓటీటీలో భీమ్లా నాయక్‌.? భారీ ఢీల్‌ సెట్‌ చేసుకున్న అమేజాన్‌.

|

Aug 29, 2021 | 7:35 PM

Bheemla Nayak: ప్రస్తుతం ఓటీటీ మార్కెట్‌ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. బడా సంస్థలు ఈ రంగంలోకి అడుగు పెట్టడంతో పోటీ పెరిగింది. దీంతో పెద్ద మొత్తాన్ని...

Bheemla Nayak: థియేటర్‌లో విడుదలైన నెల రోజులకు ఓటీటీలో భీమ్లా నాయక్‌.? భారీ ఢీల్‌ సెట్‌ చేసుకున్న అమేజాన్‌.
Bheemla Nayak Ott
Follow us on

Bheemla Nayak: ప్రస్తుతం ఓటీటీ మార్కెట్‌ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. బడా సంస్థలు ఈ రంగంలోకి అడుగు పెట్టడంతో పోటీ పెరిగింది. దీంతో పెద్ద మొత్తాన్ని పెట్టైనా సరే ఓటీటీ సంస్థలు సినిమాల హక్కులను కొనుగోలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ సంస్థలు సినిమాలకు ఆఫర్‌ చేస్తోన్న ధరలను చూస్తుంటే ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా పవన్‌ కళ్యాణ్‌, రానాలు హీరోలుగా తెరకెక్కుతోన్న భీమ్లా నాయక్‌ సినిమాకు సంబంధించి ఇలాంటి వార్తే హల్చల్‌ చేస్తోంది.

ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకునేందుకు అమేజాన్‌ ప్రైమ్‌ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అమేజాన్‌ ఇందు కోసం ఏకంగా రూ. 15 కోట్లు పెట్టనుందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా థియేటర్‌లలో విడుదలైన నెల రోజుల్లో అమేజాన్‌ ప్రైమ్‌లో రానుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉంటే మలయాళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన అయ్యప్పునుమ్ కోషియుమ్ సినిమాకు తెలుగులో భీమ్లా నాయక్‌ పేరుతో రీమేక్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో పవన్‌ కళ్యాణ్, రానాలు హీరోలుగా నటిస్తుండగా.. ఐశ్వర్య రాజేష్‌, నిత్య మీనన్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇద్దరు అగ్ర హీరోలు నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా చిత్ర యూనిట్‌ విడుదల చేసిన టీజర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పర్యవేక్షణలో తెరకెక్కిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్‌ ప్లే కూడా త్రివిక్రమ్‌ అందిస్తుండడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. భీమ్లా నాయక్‌ను సంక్రాంతి కానుకంగా జనవరి 12న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

Also Read: Varudu Kavalenu: అప్‏డేట్ వచ్చేసింది.. వరుడు కావలెను టీజర్ విడుదల ఎప్పుడంటే..

Farmers: కేంద్ర సర్కార్‌ స్కీమ్‌.. రైతులు ఇలా చేయండి.. నెలకు రూ.3000 పొందవచ్చు.. పూర్తి వివరాలు..!

Charging Stations: ఎలక్ట్రిక్‌ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఛార్జింగ్‌ సమస్యకు చెక్‌..!