Amazon Prime: అమెజాన్ ప్రైమ్ నెలరోజుల సబ్‌స్క్రిప్షన్‌ ఇక లేదు.. మూడునెలల సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సిందే.. ఎందుకంటే..

|

May 15, 2021 | 10:39 PM

Amazon Prime: ఓటీటీ ప్లాట్ ఫాంలలో తనదైన ముద్ర వేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో తన సబ్‌స్క్రిప్షన్‌ విధానాన్ని మార్చింది. గతంలో ఉన్న ప్లాన్ ల పద్ధతిని మార్చేసింది.

Amazon Prime: అమెజాన్ ప్రైమ్ నెలరోజుల సబ్‌స్క్రిప్షన్‌ ఇక లేదు.. మూడునెలల సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సిందే.. ఎందుకంటే..
Amazon Prime
Follow us on

Amazon Prime: ఓటీటీ ప్లాట్ ఫాంలలో తనదైన ముద్ర వేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో తన సబ్‌స్క్రిప్షన్‌ విధానాన్ని మార్చింది. గతంలో ఉన్న ప్లాన్ ల పద్ధతిని మార్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తన నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ విధానాన్ని తీసేసింది. అదేవిధంగా తన కొత్త కస్టమర్ల కోసం ఇచ్చే ఫ్రీ ట్రయల్‌ను కూడా తాత్కాలికంగా తొలగిస్తున్నట్టు ప్రకటించింది. సాధారణంగా అన్ని ఓటీటీలు ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ విధానాన్ని అందిస్తాయి. కొన్ని మూడు నెలలు, ఆరు నెలల సబ్‌స్క్రిప్షన్‌ విధానాన్ని కూడా అందిస్తాయి. కానీ, అమెజాన్ తన కస్టమర్ల కోసం నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ విధానాన్ని ఇస్తూ వచ్చింది. ఏడాది పాటు సబ్‌స్క్రిప్షన్‌ పొందలేని కస్టమర్లు నెలరోజుల ప్యాక్ తీసుకునే వారు. వారిప్పుడు ఇకపై మూడు నెలల ప్లాన్‌ లేదా ఏడాది ప్లాన్‌కు మారాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ నూతన మార్గదర్శకాలకు లోబడి అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమెజాన్‌ తన సపోర్ట్‌పేజీలో ఏప్రిల్‌ 27న ఈ వివరాలను అప్‌డేట్‌ చేసింది.

రీఛార్జులు, ఓటీటీ, డీటీహెచ్‌ తదితర సేవలకు సంబంధించి ఆటోమేటిక్‌ రికరింగ్‌ చెల్లింపులపై అదనపు ధ్రువీకరణ (ఏఎఫ్‌ఏ)ను రిజర్వ్‌ బ్యాంక్‌ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అయితే మార్చి 31 నుంచే తర్వాత నుంచి ఈ విధానం అమల్లోకి రావాల్సి ఉండగా.. బ్యాంకులు, పేమెంట్‌ గేట్‌వేల వినతితో అమలును సెప్టెంబర్‌ 30కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఏఎఫ్‌ఏ నిబంధనలకు లోబడి నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ₹129ను తొలగించినట్లు అమెజాన్‌ పేర్కొంది. ఇకపై మూడు నెలలకు గాను యూజర్లు ₹329 చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే ఏడాదికి ₹999 చెల్లించి ఏడాది పాటు సేవలను పొందొచ్చు. అలాగే, ప్రైమ్‌ ఫ్రీ ట్రయల్‌ను సైతం తాత్కాలికంగా తొలగించింది. భవిష్యత్‌లో పునరుద్ధరిస్తుందా? పూర్తిగా నిలిపివేస్తుందా అన్నది తెలియరాలేదు.

Also Read: Vijay Sethupathi: మ‌క్క‌ల్ సెల్వ‌న్ స్మాల్ స్క్రీన్ ఎంట్రీ.. రెమ్యూన‌రేష‌న్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Movies In OTT: వినోదాల పండగ మళ్లీ షూరు.. ఈసారి ఓటీటీలో అలరించనున్న సినిమాలు ఇవే..