ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ పైప్ క్రియేట్ అయ్యింది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కేవలం పుష్ప 2 మాత్రమే కాకుండా.. ప్రముఖ ఓటీటీ ప్లా్ట్ ఫామ్ ఆహా కోసం బన్నీ ఓ మూవీ చేస్తున్నారు. ఇందులో యంగ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ఇటీవల శ్రీలీల బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. అంతేకాకుండా.. మొదటిసారి శ్రీలీల, బన్నీ జోడి కట్టడంతో ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగ ఈ కొత్త సినిమా టైటిల్ రివీల్ చేస్తూ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. అల్లు అర్జున్, శ్రీలీల కాంబోలో రాబోతున్న ఈ కొత్త సినిమా టైటిల్ అర్జున్ లీల అని ఫిక్స్ చేశారు.
తాజాగా విడుదలైన గ్లింప్స్ లో శ్రీలీలపై దొంగ(చంద్ర) కత్తి పెట్టి బెదిరిస్తుండగా.. పోలీస్ వాడిని ఆపుతుంటాడు. ఇంతలో అక్కడికి అల్లు అర్జున్ కారులో రావడంతో గ్లింప్స్ పూర్తయ్యింది. అయితే ఇది సినిమానా ?.. లేదా ప్రమోషనల్ సాంగా ? అనేది క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. అర్జున్ లీల అసలు బొమ్మ రేపు ఉదయం పది గంటలకు విడుదల చేస్తామని తెలియజేశారు. దీనికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు.
ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత అల్లు అర్జున్ తో ఓ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్టులో సంయుక్త మీనన్ నటించనుందని… త్వరలోనే పూర్తి వివరాలను అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది.
Idi glimpse matrame ?. Asal bomma chuste agaleru anthe ? An aha Original, ‘Arjun Leela’ releasing exclusively on aha app @ 10 AM tomorrow.#AAtakesoverAha @alluarjun @sreeleela14 pic.twitter.com/EEkYL3cNbC
— ahavideoin (@ahavideoIN) June 15, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.