ఒకప్పుడు కామెడీ సినిమాలతో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. కానీ అవే మూస పాత్రలు చేయడంతో వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నాడు. దీంతో రూట్ మార్చి డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు. నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రమ్, ఆ ఒక్కటి అడక్కు సినిమాల తర్వాత అల్లరి నరేష్ నటించిన చిత్రం బచ్చల మల్లి. సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో రిలీజ్ కు ముందే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే డిసెంబర్ 20న విడుదలైన బచ్చల మల్లి సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. అల్లరి నరేష్ నటనకు కూడా మంచి పేరొచ్చింది. అయితే అప్పటికే రిలీజైన పుష్ప 2 ప్రభంజనంలో బచ్చల మల్లి సినిమా లాంగ్ రన్ ను కొనసాగించలేకపోయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. బచ్చల మల్లి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. జనవరి 9 నుంచి అల్లరి నరేష్ సినిమాను స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
సుబ్బు మంగాదేవి తెరకెక్కించిన బచ్చల మల్లి సినిమాలో హనుమాన్ బ్యూటీ అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. హరితేజ, రావు రమేశ్, సాయి కుమార్, రోహిణి, ధన రాజ్, హర్ష చెముడు, అచ్యుత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ సినిమాను నిర్మించారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. చోటా కే ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరించారు.
Experience the heartfelt journey of #BachhalaMalli and his love for Kaveri❤🔥
Watch #BachhalaMalli with your family, in cinemas now💥
Book your tickets now!
🎟️ https://t.co/7tTMaqdHVk@allarinaresh @Actor_Amritha @subbucinema @RajeshDanda_ @Composer_Vishal @_BalajiGutta pic.twitter.com/3CUb0V1Uh5— Hasya Movies (@HasyaMovies) December 26, 2024
Don’t miss out on the funnier side of things in #BachhalaMalli🤩
Watch #BachhalaMalli with your family, in cinemas now💥💥
Book your tickets now!
🎟️ https://t.co/7tTMaqdHVk@allarinaresh @Actor_Amritha @subbucinema @Composer_Vishal @RajeshDanda_ @_BalajiGutta pic.twitter.com/vfKHWZCa36— Hasya Movies (@HasyaMovies) December 26, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.