ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో హారర్, కమెడీ, లవ్ డ్రామాలు ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఫౌండ్ ఫుటేజ్ ట్రెండ్ హాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ టెక్నిక్ తో వచ్చిన ఫారానార్మల్ యాక్టివిటీతోపాటు మరికొన్ని హారర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టాయి. ఈ టెక్నిక్ తో రూపొందించిన మలయాళం సూపర్ హిట్ మూవీ ఫుటేజ్. ఇందులో మలయాళీ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ ప్రధాన పాత్రలో నటించగా.. విశాఖ్ నాయర్, గాయత్రి అశోక్ కీలకపాత్రలు పోషించారు. ఈ ముగ్గురి పాత్ర నేపథ్యంలోనే ఈ సినిమా మొత్తం సాగుతుంది. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రజెంటర్ గా వ్యవహరించాడు. ఈ చిత్రానికి సైజు శ్రీధరన్ దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా ఇదే అతడికి మొదటి సినిమా. అంతకు ముందుకు అన్వేషిప్పిన్ కండేతుమ్, అంజమ్ పాథిరా, అండ్రాయిడ్ కుంజప్పన్ చిత్రాలకు ఎడిటర్ గా వ్యవహరించారు.
బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీలివ్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అక్టోబర్ 18న ఫుటేజ్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు . మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాలో మంజు వారియర్ యాక్టింగ్, ఫౌండ్ ఫుటేజ్ టెక్నిక్ తోపాటు కాన్సెప్ట్ కూడా బాగుందంటూ రివ్యూస్ వచ్చాయి.
ఇక ఇందులో విశాల్, గాయత్రి మధ్య వచ్చే లవ్ స్టోరీ, రొమాంటిక్ సీన్స్ కూడా ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ అడియన్స్ నుంచి విమర్శలు వచ్చాయి. అందుకే ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి చూడడం కాస్త ఇబ్బందిగానే ఉంటుందని కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.