AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kerala Story 2 OTT: అఫీషియల్.. ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. ‘ది కేరళ స్టోరీ 2’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కేరళలో జరిగిన కొన్ని యదార్థ సంఘటలన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం ఈ సినిమాపై తీవ్రంగా మండిపడ్డారు.

The Kerala Story 2 OTT: అఫీషియల్.. ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. 'ది కేరళ స్టోరీ 2' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
The Kerala Story 2 Movie
Basha Shek
|

Updated on: Apr 24, 2026 | 4:37 PM

Share

రిలీజ్‌కు ముందే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న రీసెంట్ సినిమా ‘ది కేరళ స్టోరీ 2’. 2023లో అదా శర్మ లీడ్ రోల్ లో వచ్చిన ‘ది కేరళ స్టోరీ’కి సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కాంట్రవర్సీ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లనే రాబట్టింది. కామాఖ్య నారాయణ్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్య ఓజా, సుమిత్ గహ్లావత్, ఉల్కా గుప్తా, అదితి భాటియా, అల్‌కా అమిన్, అర్జన్ సింగ్ ఔజ్లా, యుక్తా ఖోస్లా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన ఈ సినిమా సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మే 8 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ అధికారికంగా పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సినిమా పోస్టర్ ను షేర్ చేస్తూ.. ‘ప్రతీ పరిపూర్ణమైన ప్రేమ కథ వెనుక ఓ పథకం ప్రకారం పన్నిన ఉచ్చు దాగి ఉంటుంది. దివ్య, నేహా, సురేఖల కలలు పీడకలగా మారిన ఆ క్షణాన్ని చూడండి’ అని క్యాప్షన్ ఇచ్చింది. తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

కేరళలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ది కేరళ స్టోరీ సినిమాను తెరకెక్కించారు. స్వతంత్ర భావాలు కలిగిన సురేఖ (ఉల్కా గుప్త), దివ్య (అదితి భాటియా), నేహా (ఐశ్వర్యా ఓజా). కేరళకు చెందిన సురేఖ యూపీఎస్సీకి సిద్ధమవుతూ ఉంటుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణించాలనేది దివ్య కోరిక. ఇక నేహా జావెలిన్ త్రో రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణిస్తూ జాతీయ స్థాయి పోటీలకు రెడీ అవుతుంటుంది. అయితే ఈ ముగ్గురమ్మాయిలు పేరెంట్స్ మాట పెడచెవిన పెట్టి మరీ ప్రేమించిన వారితో వెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయన్నదే ఈ సినిమా స్టోరీ.

జీ5లో ది కేరళ స్టోరీ 2 స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రైలు పట్టాలపై సోలార్ ప్యానెల్స్.. ఖాళీ స్థలంతోనే కోట్లాది యూనిట్ల
రైలు పట్టాలపై సోలార్ ప్యానెల్స్.. ఖాళీ స్థలంతోనే కోట్లాది యూనిట్ల
‘లివింగ్ రిలేషన్ కోసం నన్ను సంప్రదించండి’.. ఫోన్ నంబర్ ఇదే!
‘లివింగ్ రిలేషన్ కోసం నన్ను సంప్రదించండి’.. ఫోన్ నంబర్ ఇదే!
మహేష్ ఆ క్యారెక్టర్ వేస్తే చాలా స్టైలీష్‏గా ఉంటాడు..
మహేష్ ఆ క్యారెక్టర్ వేస్తే చాలా స్టైలీష్‏గా ఉంటాడు..
ఘోర విషాదం.. ల్యాండ్ అవుతూ పేలిపోయిన విమానం!
ఘోర విషాదం.. ల్యాండ్ అవుతూ పేలిపోయిన విమానం!
ఇండియా జనబంధన్ అత్యవసర భేటీ..వన్‌-టు-వన్‌ ఫార్ములాతో దీదీ ప్లాన్!
ఇండియా జనబంధన్ అత్యవసర భేటీ..వన్‌-టు-వన్‌ ఫార్ములాతో దీదీ ప్లాన్!
ఏపీ రోడ్లపై రోడ్ డాక్టర్ మ్యాజిక్.. గంటలోనే గుంత మాయం..
ఏపీ రోడ్లపై రోడ్ డాక్టర్ మ్యాజిక్.. గంటలోనే గుంత మాయం..
అసలు చేపలకు, మృగశిరకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
అసలు చేపలకు, మృగశిరకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ఎల్ నినో గుప్పిట్లో హైదరాబాద్, ఢిల్లీ.. రాబోయే 3 నెలలు కష్టమే..?
ఎల్ నినో గుప్పిట్లో హైదరాబాద్, ఢిల్లీ.. రాబోయే 3 నెలలు కష్టమే..?
నీట్ రీఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయిందా..? ఎన్‌టీఏ బిగ్ క్లారిటీ..
నీట్ రీఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయిందా..? ఎన్‌టీఏ బిగ్ క్లారిటీ..
ఇంజనీరింగ్ కన్సల్టెంట్.. ఇప్పుడు స్టార్ హీరో..
ఇంజనీరింగ్ కన్సల్టెంట్.. ఇప్పుడు స్టార్ హీరో..