Samantha: బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ కోసం సమంత ప్రత్యేక శిక్షణ.. ఫ్యామిలీ మ్యాన్‌ను మించిన సాహసాలు..

|

Mar 13, 2022 | 8:25 AM

Samantha: సమంత ఇప్పుడు ఈ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. మొన్నటి వరకు కేవలం సౌత్‌ ఇండస్ట్రీకే పరిమితమైన సమంత.. ఫ్యామిలీ మ్యాన్‌ 2 (Familyman2) వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌లోనూ (Bollywood) అడుగుపెట్టింది. ఈ వెబ్‌ సిరీస్‌లో నెగిటివ్‌ షేడ్స్‌లో ఉన్న పాత్రలో నటించి...

Samantha: బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ కోసం సమంత ప్రత్యేక శిక్షణ.. ఫ్యామిలీ మ్యాన్‌ను మించిన సాహసాలు..
Samantha
Follow us on

Samantha: సమంత ఇప్పుడు ఈ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. మొన్నటి వరకు కేవలం సౌత్‌ ఇండస్ట్రీకే పరిమితమైన సమంత.. ఫ్యామిలీ మ్యాన్‌ 2 (Familyman2) వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌లోనూ (Bollywood) అడుగుపెట్టింది. ఈ వెబ్‌ సిరీస్‌లో నెగిటివ్‌ షేడ్స్‌లో ఉన్న పాత్రలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది సామ్‌. ముఖ్యంగా ఇందులోని యాక్షన్‌ సన్నివేశాలతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిందీ బ్యూటీ. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్‌లో మరో వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది సమంత. వరుణ్‌ ధవన్‌ హీరోగా నటించనున్న ఈ వెబ్‌ సిరీస్‌లో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.

అమెరికాకు చెందిన పాపులర్‌ వెబ్‌ సిరీస్‌ సిటడెల్‌ వెబ్‌ సిరీస్‌ ఇండియన్‌ వెర్షన్‌లో సమంత, వరుణ్‌ నటిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌లో యాక్షన్‌ సన్నివేశాలను భారీగా ఉండనున్నాయని సమాచారం. దీంతో సమంత ప్రత్యేక శిక్షణ తీసుకుంటుందని తెలుస్తోంది. ఇందుకోసం సమంత ఇప్పటికే కసరత్తులు ప్రారంభించిందని సమాచారం. ఫ్యామిలీ మ్యాన్‌లో బోల్డ్‌, యాక్షన్‌ సన్నివేశాలతో మెస్మరైజ్‌ చేసిన సమంత ఈ వెబ్‌ సిరీస్‌తో ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే ఇప్పటికే ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన సమంత ప్రస్తుతం ‘యశోద’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉంది. పుష్ప సినిమాలో ‘ఊ అంటావా’ పాటతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన సమంత ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తూందో చూడాలి.

Also Read: PAN Alert: పాన్ కార్డ్ అలా వాడుతున్నారా? వెంటనే జాగ్రత్తపడకపోతే బుక్కైపోతారు..

ఏ ఇండియన్ ఫిల్మ్ సాధించలేని రికార్డ్‌ !! RRR టీం క్రేజీ అనౌన్స్‌మెంట్.. వీడియో

IRCTC Account: ఐఆర్‌సీటీసీ అకౌంట్ క్రియేట్ చేయడం ఎలా..? ఈ దశలను పాటించండి