Rashi Khanna: ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో థియేటర్లు మూతపడడంతో జనాలు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే దర్శక, నిర్మాతలు సైతం వెబ్ సిరీస్‌ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులోనూ బడా నిర్మాతలు, నిర్మాణ సంస్థలు ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టడంతో ఎక్కడ లేని ప్రచారం లభిస్తోంది. ఓటీటీ మార్కెట్ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. దీంతో స్టార్ నటీనటులు సైతం ఓటీటీ వేదికగా విడుదలయ్యే వెబ్ సిరీస్‌ల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తమన్నా, కాజల్ వంటి తారలు వెబ్ సిరీస్‌ల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా అందాల తార రాశీ ఖన్నా కూడా ఈ కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.
ఇప్పటికే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతోన్న వెబ్ సిరీస్‌లో రాశీ ఖన్నా నటిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ వంటి ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్‌ను తెరకెక్కిచ్చింది వీరే. ఇక ఈ వెబ్ సిరీస్ ఇంకా విడుదలవ్వక ముందే రాశీ ఖన్నా మరో వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. సోనీ లివ్ ఓటీటీలో విడుదల కానున్న ఓ తెలుసు వెబ్ సిరీస్‌లో నటించేందుకు రాశీ ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సిరీస్‌లో రాశీ ఖన్నా డిటెక్టివ్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. సూర్య వంగల అనే అప్ కమింగ్ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్. ఇక ఈ వెబ్ సిరీస్‌లో రాశీ మునుపెన్నడూ కనిపించని విధంగా ఓ డిటెక్టివ్ రోల్‌లో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక రాశీ ఖన్నా వేస్తోన్న అడుగులు చూస్తుంటే మారుతోన్న ట్రెండ్‌ను ఒడిసి పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు అనిపిస్తోంది కదూ!
Viral Video: ట్రాఫిక్‌లో బోర్ కొట్టిందని పక్కనే ఉన్న మొసళ్ల నదిలో దూకేశాడు.. ఆ తర్వాత షాక్