Aishwarya Rajesh: ఓటీటీలోకి వచ్చేసిన ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..

ఇన్నాళ్లు తమిళ చిత్రపరిశ్రమలో అగ్ర కథానాయికగా కొనసాగిన ఐశ్వర్య రాజేశ్.. ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని ఆఫర్స్ అందుకుంటున్నట్లు సమాచారం. తాజాగా ఈ అమ్మడు నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

Aishwarya Rajesh: ఓటీటీలోకి వచ్చేసిన ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..
Garuda 2.0 Film

Updated on: Apr 30, 2025 | 10:25 AM

ఐశ్వర్య రాజేశ్.. ప్రస్తుతం తెలుగులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అచ్చ తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళంలోనే ఎక్కువ అవకాశాలు అందుకుంది ఐశ్వర్య. అతి తక్కువ సమయంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకున్న ఐశ్వర్య రాజేశ్.. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం పాత్రలో అదరగొట్టింది ఐశ్వర్య. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయి భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో ఇప్పుడిప్పుడే తెలుగులో మరిన్ని ఆఫర్స్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. గతంలో ఐశ్వర్య రాజేశ్ నటించిన ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అదే ఆరత్తు సినమ్. 2016లో తమిళంలో విడుదలైన ఈ సినిమాకు దృశ్యం సిరీస్ ఫేమ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కథ అందించారు. ఆరత్తు సినమ్ అంటే కోపం చల్లారదు అని అర్థం. థియేటర్లలో విడుదలైన 9 ఏళ్లకు తెలుగులో ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సినిమాను తెలుగులో గరుడ 2.0 పేరుతో తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. హనుమాన్ మీడియా బ్యానర్ పై ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకు అరివళగన్ వెంకటాచలం దర్శకత్వం వహించారు. ఇందులో హీరో అరుళ్ నిధి, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో పోషించారు.

కథ విషయానికి వస్తే..
తన భార్య, బిడ్డలు హత్యకు గురైన తర్వాత ఏసీపీ అరవింద్ (అరుళ్ నిధి)మందుకు బానిసై సస్పెన్షన్ అవుతాడు. ఆ తర్వాత కొందరు యువకులు కిడ్నాప్ కావడంతో… ఆ కేసును దర్యాప్తు చేసే బాధ్యతను అరవింద్ కు అప్పగిస్తారు. ఈ కేసును అరవింద్ ఎలా పరిష్కరించాడు ? అనేది సినిమా. ప్రస్తుతం ఈ మూవీ ఆహా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..