Adah Sharma: అదా శ‌ర్మ‌కు అదిరిపోయే ఆఫ‌ర్ ఇచ్చిన అమేజాన్‌.. లేడీ ఓరియెంటెడ్ బోల్డ్ వెబ్ సిరీస్‌లో..

|

Jun 20, 2021 | 6:10 AM

Adah Sharma: హార్ట్ అటాక్ సినిమాతో తెలుగు కుర్ర‌కారుకు నిజంగానే త‌న అందంతో గుండెపోటు తెచ్చింది అందాల తార అదాశ‌ర్మ‌. తొలిసినిమాలోనే త‌న‌దైన క్యూట్ న‌ట‌న‌, అందంతో ఆక‌ట్టుకున్న ఈచిన్న‌ది న‌టిగా...

Adah Sharma: అదా శ‌ర్మ‌కు అదిరిపోయే ఆఫ‌ర్ ఇచ్చిన అమేజాన్‌.. లేడీ ఓరియెంటెడ్ బోల్డ్ వెబ్ సిరీస్‌లో..
Aadha Sharma Web Series
Follow us on

Adah Sharma: హార్ట్ అటాక్ సినిమాతో తెలుగు కుర్ర‌కారుకు నిజంగానే త‌న అందంతో గుండెపోటు తెచ్చింది అందాల తార అదాశ‌ర్మ‌. తొలిసినిమాలోనే త‌న‌దైన క్యూట్ న‌ట‌న‌, అందంతో ఆక‌ట్టుకున్న ఈచిన్న‌ది న‌టిగా మంచి మార్కులు కొట్టేసింది. ఇక అనంత‌రం క్ష‌ణం, స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి వంటి సినిమాల్లో మంచి స్కోప్ ఉన్న‌పాత్ర‌ల్లో న‌టించి మెప్పించింది. అయితే ఈ సినిమాల త‌ర్వాత అదాకు మ‌ళ్లీ ఆశించిన స్థాయిలో విజ‌యం ద‌క్క‌లేదు.
దీంతో అదాశ‌ర్మ త‌న‌లోని హాట్‌నెస్‌ను కూడా బ‌య‌ట‌పెట్టింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా గ్లామ‌ర్ ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటోంది. ఇదిలా ఉంటే తాజాగా అదాశ‌ర్మ‌కు ఒక మంచి ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమేజాన్ ప్రైమ్ ఓ వెబ్ సిరీస్ కోసం అదా శ‌ర్మ‌ను సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం. హిందీతోపాటు ద‌క్షిణాదికి చెందిన అన్ని భాష‌ల్లో ఈ వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించ‌నున్న‌ర‌ని తెలుస్తోంది. ఇక ఈ వెబ్ సిరీస్‌ను లేడీ ఓరియెంటెడ్ బోల్డ్ క‌థాంశంతో తెర‌కెక్కించ‌నున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. మ‌రి గ‌త కొన్నేళ్లుగా స‌రైన ఆఫ‌ర్లు లేక ఢీలా ప‌డ్డ అదాకు ఈ వెబ్ సిరీస్ అయినా పూర్వ వైభ‌వం తెచ్చి పెడుతుందో లేదో చూడాలి.

Also Read: Radhe Shyam: ‘రాధేశ్యామ్’ లో ప్ర‌భాస్ కామెడీ నెక్ట్స్ లెవ‌ల్.. హింట్ ఇచ్చిన ఆ క‌మెడియన్

Madhuri Dixit: యోగాసనాలవలన ఆరోగ్యప్రయోజనాలను వివరిస్తూ వీడియో షేర్ చేసిన మాధురీ దీక్షిత్

Karthika Deeepam Today: కాలం, గాలి రెండు నావైపే ఉన్నాయి .. ఇప్పుడు టైం నాది అంటున్న మోనిత