Actor Suriya: రియల్ సినతల్లి పేరుతో రూ.10 లక్షలు డిపాజిట్ చేసిన హీరో సూర్య.. ఇల్లు కట్టిస్తానన్న లారెన్స్..

Actor Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజా సినిమా జై భీమ్.. విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది. పోలీసు కస్టడీలో చంపబడిన తన భర్త రాజకన్నుకు న్యాయం చేయమని..

Actor Suriya: రియల్ సినతల్లి పేరుతో రూ.10 లక్షలు డిపాజిట్ చేసిన హీరో సూర్య.. ఇల్లు కట్టిస్తానన్న లారెన్స్..
Hero Sryia

Updated on: Nov 15, 2021 | 7:38 AM

Actor Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజా సినిమా జై భీమ్.. విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది. పోలీసు కస్టడీలో చంపబడిన తన భర్త రాజకన్నుకు న్యాయం చేయమని భార్య పార్వతి అమ్మాళ్ చేసిన న్యాయపోరాటం ఆధారంగా తెరకెక్కింది. పార్వతమ్మ, రాజకన్ను అనే వ్యక్తుల జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా ఫ్యాన్స్ నే కాదు.. సెలబ్రెటీలు సైతం ఆకట్టుకున్నది. టీజే. జ్ఞానవేల్… దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై సీఎం స్టాలిన్ ప్రశంసల వర్షం కురిపిస్తూ.. ఏకంగా హీరో సూర్యకు ఓ లెటర్ కూడా రాశారు.

అయితే పార్వతి అమ్మాళ్ ఫ్యామిలీకి హీరో సూర్య ఆర్ధికంగా అండగా నిలబడ్డారు. తాజాగా హీరో సూర్య పార్వతి అమ్మాళ్ పేరిట రూ.10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేశారు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మీద వడ్డీని ప్రతి నెలా పార్వతి అమ్మాళ్‌కి అందజేస్తారు. ఆమె మరణానంతరం ఆ మొత్తాన్ని ఆమె పిల్లలకు అందజేస్తామని సూర్య చెప్పారు. ఈ విషయాన్ని సూర్య సొంత నిర్మాణ సంస్థ అయిన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్విట్టర్ అకౌంట్‌లో వెల్లడించింది. మరోవైపు ఈ సినిమాని చూసిన పార్వతి ఫ్యామిలీకి అండగా నిలబడతానని దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ చెప్పారు. రియల్ సినతల్లి అయిన పార్వతమ్మకు సొంతిల్లు కట్టిస్తానని ప్రకటించారు.

టీజే. జ్ఞానవేల్ తెరకెక్కించిన జై భీమ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులను నెలకొల్పుతోంది. ఐఏమ్‌డీబీలో 9.6 రేటింగ్ సాధించి ప్రపంచ స్థాయి రికార్డును సృష్టించింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, లిజో మోల్ జోస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

 

Also Read:

 అయ్యప్ప స్వామి పూజ ప్రాంగణంలో అద్భుత దృశ్యం.. దేవుడి చిత్రపటాల మధ్య నాగుపాము ప్రత్యక్షం..

ఈరోజు ఏ రాశివారికి అనుకూలంగా ఉండి ఆకస్మిక ధనలాభం పొందుతారంటే.. నేటి రాశిఫలాలు