Kanguva OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన సూర్య కంగువా.. ఎక్కడ చూడొచ్చంటే?

|

Dec 08, 2024 | 8:13 AM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం కంగువా. శివ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కథానాయికగా నటించింది.నవంబర్ 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

Kanguva OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన సూర్య కంగువా.. ఎక్కడ చూడొచ్చంటే?
Kanguva Movie
Follow us on

తమిళ స్టార్ హీరో సూర్య కు తెలుగులోనూ భారీగా అభిమానులు ఉన్నారు. అందుకే అతను నటించిన సినిమాలన్నీ ఇక్కడ కూడా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంటాయి. అలా తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజైన సూర్య సినిమా కంగువా. గతంలో తెలుగులో ‘శౌర్యం’, ‘శంఖం’ ‘దరువు’ లాంటి పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్లను తెరకెక్కించిన శివ ఈ సినిమాకు దర్శకత్వ వహించారు. దాదాపు మూడేళ్ల పాటు వ్యయ ప్రయాసల కోర్చి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు. దీంతో కంగువా మూవీని ఏకంగా కోలీవుడ్ బాహుబలి అంటూ ప్రచారం చేశారు. తీరా రిలీజయ్యాక చూస్తే మాత్రం సినిమాలో మ్యాటర్ తేడా కొట్టేసింది. అభిమానుల భారీ అంచనాల మధ్య నవంబర్ 14న రిలీజైన కంగువా సినిమా ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కథ, కథానాలు మరీ నీరసంగా ఉన్నాయని నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే సూర్య నటన, యాక్షన్ సీక్వన్స్ బాగున్నాయని ప్రశంసలు వచ్చాయి. ఇలా థియేటర్లలో ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోని కంగువా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. డిసెంబరు 8 నుంచి కంగువా సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచే సూర్య సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తమిళ్ తో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లోనూ సూర్య సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.

స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ నిర్మించిన కంగువా సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కథానాయికగా నటించింది. అలాగే యానిమల్ ఫేమ్, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్  ఇందులో విలన్ గా మెప్పించాడు. కమెడియన్ యోగిబాబుతో పాటు మరికొందరు  ప్రముఖ  నటీనటులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మరి థియేటర్లలో కంగువా సినిమాను మిస్ అయ్యారా? సూర్య నటన కోసం అలాగే యాక్షన్ సినిమాలు బాగా ఇష్టడేవారు కంగువా సినిమాపై ఓ లుక్కేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.