
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు నందు. ఇన్నాళ్లుగా సహయ నటుడిగా పలు సినిమాల్లో కనిపించిన నందు.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడిప్పుడే వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దండోరా, వనవీర తదితర చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్, విలన్ పాత్రలు పోషించారు. నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నందు హీరోగా సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇటీవలే హీరోగా ఓ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. అదే సైక్ సిద్ధార్థ్. మంచి క్యూరియాసిటీ మధ్య విడుదలైన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. థియేటర్లలో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ మాత్రం రాలేదు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..
ఈనెల 1న థియేటర్లలో విడుదలైంది సైక్ సిద్ధార్థ్. ప్రమోషన్స్ సమయంలో సినిమా కోసం నందు పడిన కష్టం, తన ఎదురుచూపులు, సవాళ్ల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమాతో హీరోగా సక్సెస్ అవ్వాలని ట్రై చేశాడు. కానీ మూవీ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఇదే సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఫిబ్రవరి 4 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. గోల్డ్ యూజర్స్ ఒకరోజు ముందే ఈ చిత్రాన్ని చూడొచ్చు. ఈ సినిమాలో నందు, యామినీ భాస్కర్ హీరోహీరోయిన్లుగా నటించగా.. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు.
ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..
కథ విషయానికి వస్తే..
ఈ చిత్రంలో సిద్ధార్థ్ (నందు) తన ప్రియురాలు త్రిష (ప్రియాంక)తో కలిసి బిజినెస్ ప్లాన్ చేస్తారు. తమకు పరిచయమైన మన్సూర్ (సుఖేష్ రెడ్డి)తో కలిసి ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తారు. అందులో సిద్ధార్థ్ 2 కోట్లు పెట్టుపడి పెడతాడు. చివరకు త్రిష, మన్సూర్ కలిసిపోయి సిద్ధార్థ్ ను దారుణంగా మోసం చేస్తారు. అంతా పోగొట్టుకున్న సిద్ధార్థ్ చివరకు హైదరాబాద్ లోని ఓ బస్తీలో నివసిస్తుంటాడు. అదే కాలనీలోకి భర్త వేధింపులు భరించలేక తన కొడుకును తీసుకుని వస్తుంది శ్రావ్య (యామినీ భాస్కర్). వీరిద్దరు ఎలా కలిశారు.. ? చివరకు ఏం జరిగింది అనేది సినిమా.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..
When the past refuses to stay in the past 👀
A story that messes with your mind & heart 💛🧠#PsychSiddhartha from Feb 4 only on #aha
@SouthBayLive @SpiritMediaIN @SureshProdns @wareymedia pic.twitter.com/uVZxr7dEgU
— ahavideoin (@ahavideoIN) January 25, 2026
ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..