Good Bad Ugly OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న అజిత్ సూపర్ హిట్ మూవీ.. గుడ్ బ్యాడ్ అగ్లీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..

కోలీవుడ్ హీరో అజిత్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తమిళంతోపాటు తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరోవైపు తనకు ఇష్టమైన బైక్, కార్ రేసింగ్ లలో పాల్గొంటూ జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Good Bad Ugly OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న అజిత్ సూపర్ హిట్ మూవీ.. గుడ్ బ్యాడ్ అగ్లీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Good Bad Ugly

Updated on: May 03, 2025 | 1:22 PM

కోలీవుడ్ హీరో అజిత్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో హీరోయిన్ త్రిష అజిత్ సరసన సందడి చేసింది. విడాముయార్చి సినిమా తర్వాత వీరిద్దరు కలిసి నటించిన సినిమా ఇది. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రూ.200 కోట్లకు పైగా భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఈ ఏడాది వరుసగా విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న అజిత్.. ప్రస్తుతం కార్ రేసింగ్ పై దృష్టి పెట్టారు. ఇదిలా ఉంటే.. ఇటీవల థియేటర్లలో సూపర్ హిట్ అయిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ప్రకటించారు.

గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా డిజిటల్ రైట్స్‏ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా మే 8 నుంచి నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. తమిళంతోపాటు హిందీ, కన్నడ, మలయాళం, తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం అజిత్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది విడాముయార్చి సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు అజిత్. నిత్యం డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటున్నారు అజిత్. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అజిత్ కు పద్మ భూషణ్ అవార్డ్ అందించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..